యాప్నగరం

'జగన్ గారూ.. అదేలా సాధ్యమో ప్రజలకు కొంచెం చెప్పండి సార్'

'ముఖ్యమంత్రి జగన్ గారూ.. మీరు, మీ 22 మంది ఎంపీలు మెడలు వంచి సాధిస్తారో కాళ్ళు పట్టుకుని సాధిస్తారో కొంచం ప్రజలకు చెప్పండి సారు' అంటూ ట్విట్టర్‌లో ప్రశ్నించిన విజయవాడ ఎంపీ కేశినేని నాని.

Samayam Telugu 20 Nov 2019, 11:29 am
ఏపీలో కడప స్టీల్ ప్లాంట్, దుగరాజపట్నం ఓడరేవుతో పాటూ విభజన చట్టంలోని అంశాలపై లోక్‌సభలో కేంద్రం క్లారిటీ ఇచ్చింది. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కేంద్రాన్ని లిఖితపూర్వకంగా ప్రశ్నించగా.. కేంద్రం సమాధానం ఇచ్చింది. ఏపీ విభజన చట్టంలో పేర్కొన్నట్టుగా కడప స్టీల్ ప్లాంటు, దుగరాజట్నం రేవు ఏర్పాటు లాభదాయం కాదని తెలిపింది. నియోజకవర్గాల పెంపు కూడా 2026 తర్వాత జరిగే జనాభా లెక్కలు పూర్తయ్యేవరకూ సాధ్యం కాదని చెప్పింది.
Samayam Telugu cm jagan.


Read Also: 'ఆ రౌడీషీటర్ ప్రజలకు ఆదర్శమా చంద్రబాబూ'

ఇదే అంశాన్ని కేశినేని నాని ట్విట్టర్‌లో ప్రస్తావించారు. ముఖ్యమంత్రి జగన్ విభజన హామీలను ఎలా సాధిస్తారో చెప్పాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. గతంలో జగన్ చేసిన వ్యాఖ్యల్ని ప్రస్తావిస్తూ చురకలంటించారు. నాని తన ట్వీట్‌లో ‘ముఖ్యమంత్రి జగన్ గారూ.. మీరు, మీ 22 మంది ఎంపీలు మెడలు వంచి సాధిస్తారో కాళ్ళు పట్టుకుని సాధిస్తారో కొంచం ప్రజలకు చెప్పండి సారు’అంటూ సెటైర్లు పేల్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.