యాప్నగరం

Fake IPS Officer: వీఐపీ దర్శనానికి యత్నం.. తిరుమలలో తెలంగాణ అధికారి అరెస్ట్

Tirumalaలో నకిలీ ఐడీ కార్డుతో వీఐపీ బ్రేక్ దర్శనానికి ప్రయత్నించిన తెలంగాణకు చెందిన ఓ అధికారిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Samayam Telugu 8 Jan 2020, 3:27 pm
నకిలీ ఐడీ కార్డుతో తిరుమలలో వీఐపీ దర్శనం కోసం ప్రయత్నించిన తెలంగాణ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ హ్యాండ్లూమ్స్ టెక్స్‌టైల్స్ డైరెక్టర్ అయిన అరుణ్ కుమార్.. ఐపీఎస్ అధికారినంటూ తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనానికి దరఖాస్తు చేసుకున్నారు. గ్రూప్-1 అధికారి అయిన ఆయన.. నకిలీ ఐడీ కార్డుతో టికెట్లకు దరఖాస్తు చేశారని తెలుస్తోంది. వీఐపీ బ్రేక్ దర్శనం కోసం జేఈవో ఆఫీసు సిబ్బంది గదమాయించడంతో.. అనుమానం వచ్చిన టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu fake ips officer


దీంతో అరుణ్ నకిలీ ఐడీ కార్డుతో టికెట్లకు దరఖాస్తు చేశారని గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఆయన గతంలో మంత్రి ముకేశ్ గౌడ్ వద్ద ఓఎస్డీగా పని చేసినట్టు గుర్తించారు. శ్రీవారి దర్శనం కోసం అరుణ్ మంగళవారం తిరుమల చేరుకున్నారు. గతంలోనూ.. ఐఆర్ఎస్ అధికారినంటూ తిరుమల వీఐపీ దర్శనం కోసం ప్రయత్నించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.