యాప్నగరం

విశాఖ: షిప్‌యార్డ్ ఘటనలో చనిపోయిన కొడుకు కోసం వస్తుండగా ప్రమాదం.. ముగ్గురు మృతి

హిందూస్థాన్ షిప్‌యార్డ్‌లో ప్రాణాలు కోల్పోయిన తమ కుమారుడ్ని చూడటానికి వస్తున్నవారిని మృత్యువు వెంబడించింది. శ్రీకాకుళం జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 2 Aug 2020, 9:46 am
శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎదురుగా ఉన్న ఓ వాహానాన్ని కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతిచెందారు. కంచిలి మండలం కంచిలి మండలం జలంతరకోట జాతీయ రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒడిశా నుంచి విశాఖవైపు వస్తున్న స్కార్పియో.. ఎదురుగా ఉన్న వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో స్కార్పియోలోని ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడ్డారు. బాధితులను ఖరగ్‌పూర్ వాసులుగా గుర్తించారు.
Samayam Telugu రోడ్డు ప్రమాదం
Road Accident


వీరు విశాఖ హిందూస్థాన్ షిప్‌యార్డ్‌లో జరిగిన దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుమారుడ్ని చూడటానికి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకోవడం బాధాకరం. ప్రమాదం గురించి తెలిసిన అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని కారులోని మృతదేహాలను బయటకు తీశారు.

ఘటనపై కేసు నమోదుచేసి, మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం తరలించారు. ప్రమాదంలో గాయపడినవారిని మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం ప్రభుత్వాస్పత్రికి పంపారు. స్కార్పియో డ్రైవర్ నిద్రమత్తు వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. నిద్రమత్తుతో ఆగి ఉన్న వాహానాన్ని గమనించకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించిపోగా.. పోలీసులు క్రమబద్దీకరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.