యాప్నగరం

కిక్కు కోసం స్పిరిట్ తాగి.. ముగ్గురు మృతి.. విశాఖలో దారుణం

విశాఖ జిల్లా కశింకోటలోని గోవిందరావు కాలనీలో ఆదివారం మత్తు కోసం సర్జికల్ స్పిరిట్ తాగి ముగ్గురు మృతి చెందారు.

Samayam Telugu 31 May 2020, 4:07 pm
విశాఖపట్నం జిల్లా కశింకోటలోని గోవిందరావు కాలనీలో ఆదివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మత్తు కోసం సర్జికల్ స్పిరిట్ తాగి ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. గోవిందరావు కాలనీకి చెందిన కూనిశెట్టి ఆనంద్‌ రావ్‌ స్నేహితులతో పార్టీ చేసుకుందామని భావించారు. కిక్‌ కోసం మత్తు ఎక్కువగా ఉంటుందని స్పిరిట్‌ను తీసుకొని వచ్చాడు. ఈ పార్టీలో ఆరుగురు పాల్గొనగా.. నలుగురు స్పిరిట్‌ తాగారు. తాగిన వెంటనే వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Samayam Telugu సర్జికల్ స్పిరిట్


ఈ నలుగురిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం విశాఖ ఆస్పత్రికి తరలించారు.

కాగా, మృతి చెందిన వారిని వడిసెల నూకరాజు, కూనిశెట్టి ఆనంద్, పెతకం శెట్టి అప్పారావులుగా గుర్తించారు. చనిపోయిన ముగ్గురిలో ఇద్దరు ఆటో డ్రైవర్లు, ఒకరు లారీ క్లీనర్. ఆస్పత్రిలో ప్రాణాపాయంతో కొట్టుమిట్టాడుతున్న మాణిక్యం రోజువారీ కూలిపనులు చేసుకుంటూ జీవనం గడుపుతున్నాడు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.