యాప్నగరం

Bapatla: సూర్యలంక తీరంలో విషాదం.. ఏడుగురు విద్యార్థులు గల్లంతు

Bapatla: దసరా సెలవుల వేళ సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి విద్యార్థులు తమ నిండు ప్రాణాలు కొల్పోతున్న ఘటనలు తెలుగు రాష్ట్రాల్లో వరుసగా చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారంలో నలుగురు విద్యార్థులను ఓ నీటి కుంట మింగేసిన ఘటన మరవక ముందే.. ఏపీలోనూ అలాంటి విషాదకర సంఘటనే చోటుచేసుకుంది. బాపట్లలోని సూర్యలంక సముద్రతీరంలో స్నానానికి వెళ్లిన ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. అందులో ఇద్దరు ప్రాణాలతో బయటపడగా.. మరో ముగ్గురు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకో ఇద్దరి గురించి గాలింపు జరుగుతోంది.

Authored byరామ్ ప్రసాద్ | Samayam Telugu 4 Oct 2022, 2:32 pm
Bapatla: ఏపీలో బాపట్లలోని సూర్యలంక సముద్రతీరంలో విషాదం చోటుచేసుకుంది. తీరంలో స్నానానికని వెళ్లి ఏడుగురు విద్యార్థులు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థుల్లో ఇద్దరిని గజ ఈతగాళ్లు ప్రాణాలతో రక్షించారు. కాగా.. మరో ముగ్గురు విద్యార్థుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకో ఇద్దరి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. చనిపోయిన విద్యార్థులు.. విజయవాడలోని సింగ్‌నగర్‌కు చెందిన సిద్ధు, అభి, సాయి మధుగా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Samayam Telugu Students
విద్యార్థులు గల్లంతు


undefinedదసరా పండగ సెలవుల నేపథ్యంలో తెలుగురాష్ట్రాల్లో ఇలాంటి ఘటనలు వరుసగా చోటుచేసుకున్నాయి. తెలంగాణలోనూ.. సెలవులు వచ్చిన ఆనందంలో.. సరదాగా ఈతకు వెళ్లి చెరువులు, కుంటల్లో విద్యార్థులు ప్రమాదవశాత్తు మునిగి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవలే.. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో తాటిపర్తి గ్రామంలో నలుగురు విద్యార్థులు చనిపోయిన ఘటన చోటుచేసుకుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే రకమైన విషాదకర చోటుచేసుకోవటంతో.. తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది.

రచయిత గురించి
రామ్ ప్రసాద్
రాంప్రసాద్ తుప్పారం సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, స్పోర్ట్స్, సినిమాకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.