యాప్నగరం

ఏపీలో ఈ జిల్లాలకు పిడుగుల హెచ్చరికలు

పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు.. పశువులు-గొర్రెల కాపరులు చెట్ల కింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు. అందరూ సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని కోరారు.

Samayam Telugu 11 Sep 2020, 3:56 pm
ఏపీలో కొన్ని జిల్లాలకు ప్రభుత్వం పిడుగుల హెచ్చరికలు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లాలోని అడ్డ తీగల, గంగవరం, రంపచోడవరం, ఏలేశ్వరం, జగ్గంపేట, దేవిపట్నం, మారేడుమిల్లి.. పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, చింతలపూడి.. విశాఖ జిల్లాలోని అరకులోయ, అనంతగిరి, జి.మాడుగుల, చింతపల్లె, రావికమతం, రోలుగుంట, గొలుగొండ, కొయ్యూరు.. మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది.
Samayam Telugu పిడుగుల హెచ్చరిక


పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు.. పశువులు-గొర్రెల కాపరులు చెట్ల కింద , బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు. అందరూ సురక్షితమైన భవనాల్లోకి వెళ్లాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. ఏపీలోని పలు జిల్లాల్లో కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే పిడుగులు పడే అవకాశం ఉన్న జిల్లాల ప్రజల్ని విపత్తుల నిర్వహణశాఖ అప్రమత్తం చేస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.