యాప్నగరం

బయట ప్రజల ఆర్తనాదాలు.. అసెంబ్లీలో పొగడ్తలు.. చంద్రబాబు ఫైర్

AP governmentపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఫైర్ అయ్యారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వరదలు రాయలసీమ జిల్లాలను ముంచెత్తాయన్నారు. హూదూద్ తుఫాన్ సమయంలో తాను చేసిన పనిని.. ఈ ప్రభుత్వం చేయలేకపోయిందని ఆయన ఆరోపించారు.

Samayam Telugu 25 Nov 2021, 1:04 pm
అధికారం ఉందని ఇష్టారీతిన వ్యవహరిస్తే.. అధికారం ఇచ్చిన వాళ్లే పాతాళానికి నెడుతారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగానే వరదలు రాయలసీమ జిల్లాలను ముంచెత్తాయన్నారు. భారీ వర్షాలు కురుస్తాయని ముందుగానే సమాచారం ఉన్నా.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రజలకు శాపంగా మారిందని ఆయన మండిపడ్డారు. రేణిగుంటలో వరదలపై మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu రేణిగుంటలో మీడియాతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు


వరదలతో మునిగిపోయి ప్రజలు బయట ఆర్తనాదాలు చేస్తుంటే.. అసెంబ్లీ ముఖ్యమంత్రి పొగడ్తలు చెప్పించుకుంటున్నారని చంద్రబాబు ఫైర్ అయ్యారు. చెన్నై వర్షాల ఎఫెక్ట్ కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరుపై పడిందన్నారు. ప్రకృతి వైపరీత్యాలు చెప్పిరావని.. అలాంటప్పుడే ప్రభుత్వ సమర్థత ఎంటో తెలుస్తుందని అన్నారు. హూదూద్ తుఫాన్ సమయంలో తాను చేసిన పనిని.. ఈ ప్రభుత్వం చేయలేకపోయిందని ఆయన ఆరోపించారు. పించా, అన్ననయ్య డ్యామ్‌లలో ఈ వరద నీళ్లు వస్తున్నా ప్రజలను అప్రమత్తం చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.

రాష్ట్రంలో వరదల కారణాలపై న్యాయ విచారణ చేపట్టాలని చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. వరదలతో ఊరుకు ఊరే తుడిచిపెట్టుకుపోయే పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ప్రభుత్వం ముందే అప్రమత్తం చేసి ఉంటే.. ప్రాణనష్టం తగ్గేదన్నారు. రాయలచెరువుకు గతంలో ఎన్నడూ లేనంతగా నీరు వచ్చిందని.. దీనిని మేనేజ్ చేయడంతో అధికారులు విఫలమయ్యారని పేర్కొన్నారు. ప్రకృతితో ఆడుకుని.. తుమ్మలగుంట చెరువును క్రికెట్ స్టేడియంగా మార్చేశారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వరద బాధిత మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.