యాప్నగరం

విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లేవారికి అలర్ట్

బుధవారం నుంచి ఈ నెల 21 వరకు ఫ్లై ఓవర్ లోడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ నియంత్రణ లేదని.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు మాత్రం.

Samayam Telugu 19 Aug 2020, 7:03 am
విజయవాడ మీదుగా హైదరాబాద్ వెళ్లేవారికి అలర్ట్. విజయవాడలో కీలకమైన కనకదుర్గ ఫ్లై ఓవర్‌ సిద్ధమైంది. భవానీపురం నుంచి దుర్గగుడి మీదుగా రాజీవ్ గాంధీ పార్కు వరకు నిర్మించిన ఈ ఫ్లై ఓవర్ ప్రారంభానికి అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. ఇక కాంట్రాక్ట్ తీసుకున్నా సోమా కంపెనీ లోడ్ లారీలను ఒకవైపుగా వెళ్లనిచ్చి లోడ్‌ టెస్ట్‌ నిర్వహించారు. బుధవారం నుంచి ఫ్లై ఓవర్ పై రెండవ లోడ్ టెస్ట్‌కి సిద్ధం అవుతోంది.
Samayam Telugu విజయవాడ


కనకదుర్గ ఫ్లై ఓవర్‌పై లోడ్ టెస్ట్ వల్ల విజయవాడలో కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బుధవారం నుంచి ఈ నెల 21 వరకు ఫ్లై ఓవర్ లోడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ నియంత్రణ లేదని.. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలు మాత్రం భవానీపురం నుంచి ఆర్టీసీ వర్క్ షాప్- సితార జంక్షన్- సీవీఆర్ ఫ్లై ఓవర్- వైవీఆర్ ఎస్టేట్- పైపుల రోడ్- ఇన్నర్ రింగ్ రోడ్డు- రామవరప్పాడు రింగ్ వైపుగా వెళ్ళాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.