యాప్నగరం

పవన్ ఇంటి ముందు టీఆర్ఎస్ కార్యకర్తల ధర్నా

పవన కళ్యాణ్ ఇంటి ముందు ధర్నాకు దిగిన టీఆర్ఎస్ కార్యకర్తలు. జనసేన పార్టీ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. అమర వీరులపై చేసిన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చిన పవన్.

Samayam Telugu 4 Aug 2019, 5:36 pm
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి ముందు టీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నాకు దిగారు. తెలంగాణ ఉద్యమకారులు, అమర వీరులు.. వారి త్యాగాలను పవన్ హేళ చేసేలా మాట్లాడారంటూ నిరసన చేపట్టారు. అలాగే జనసేన తెలంగాణ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. పవన్ తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని వెంటనే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Samayam Telugu pawan.


మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ వివాదంపై స్పందించారు. భీమవరం పర్యటనకు వెళుతూ రాజమండ్రిలో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించారు. ‘మద్య నిషేధం ఎలా కష్టసాధ్యమైన ప్రక్రియో చెప్పేందుకే సాయుధ పోరాట ఉద్యమ కాలం నాటి విషయాన్ని ఉటంకించాను. పోరాటాన్ని అణిచేందుకు మద్య నిషేధాన్ని వాడుకున్నా సాధ్యం కాని విషయాన్ని అప్పటి చరిత్రను చెప్పే రచనలు చూడవచ్చు’అంటూ పవన్ చెప్పిన మాటను జనసేన ట్వీట్ చేసింది.
ఇంతకీ ఈ వివాదం ఏంటి
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీలో మద్యపాన నిషేధంపై సాధ్యాసాధ్యాలపై స్పందిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో జరిగిన అంశాల గురించి ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలుపుతూ టీఆర్ఎస్ నిరసనకు దిగింది. దీంతో ఈ వివాదానికి పుల్‌స్టాప్ పెట్టేంందుకు పవన్ కళ్యాణ్ స్పందించారు. తన వ్యాఖ్యలపై క్లారిటీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.