యాప్నగరం

APSRTC విభజనపై కేంద్రం వాదనలు.. ఆంధ్రా ఉద్యోగుల్లో ఆందోళన, మంత్రి క్లారిటీ

Telangan RTC సమ్మె సందర్భంగా హైకోర్టులో వాదించిన కేంద్రం.. ఏపీఎస్ఆర్టీసీని విభజనకు తాము ఆమోదం తెలపలేదని ప్రకటించింది. తమకు ఏపీఎస్ఆర్టీసీలోనే 31 శాతం వాటా ఉందని పేర్కొంది. టీఎస్ఆర్టీసీ ఏర్పాటును ప్రశ్నించింది.

Samayam Telugu 7 Nov 2019, 9:12 pm
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై హైకోర్టులో వాదనల సందర్భంగా.. కేంద్రం చేసిన వ్యాఖ్యలు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగుల్లో కలవరానికి కారణం అవుతున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత.. ఆర్టీసీని రెండుగా విభజించగా.. ఈ ప్రక్రియకు తమ అనుమతి తీసుకోలేదని కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ రాజేశ్వరరావు న్యాయస్థానానికి తెలిపారు. కేంద్రానికి ఏపీఎస్ఆర్టీసీలో వాటా ఉంది కానీ.. టీఎస్ఆర్టీసీలో కాదని ఆయన స్పష్టం చేశారు.
Samayam Telugu rtc strike


ఏపీఎస్ఆర్టీసీ విభజనే పూర్తి కానప్పుడు.. టీఎస్ఆర్టీసీ ఏర్పాటుకు చట్టబద్ధత ఏముందని కేంద్రం ప్రకటించగా.. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండా రెండు సంస్థలను ఎలా ఏర్పాటు చేస్తారని హైకోర్టు ప్రకటించింది.

టీఎస్ఆర్టీసీ ఏర్పాటునే ప్రశ్నించడం ద్వారా.. ఆర్టీసీ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కేంద్రం ప్రశ్నించినట్టయ్యింది. కొన్ని రూట్లను ప్రయివేట్ పరం చేస్తామని.. ఆర్టీసీ లాభాల్లో ఉండాలంటే.. పూర్తి స్థాయి ప్రక్షాళన చేయాల్సిందేనని పట్టుదలతో ఉన్న కేసీఆర్ సర్కారుకు ఇదో రకంగా షాకే.

హైకోర్టులో కేంద్రం వాదనలతో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. ఈ విషయమై మంత్రి పేర్ని నాని స్పందిస్తూ.. తెలంగాణ ఆర్టీసీ ఎఫెక్ట్.. ఏపీపై ఉండబోదన్నారు. ఆర్టీసీ విభజన అనేది సాంకేతిక అంశమన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడానికి, విభజనకు సంబంధం లేదన్నారు. విలీన ప్రక్రియకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు.

ఏపీలో కార్మికుల విలీనానికి ఆర్టీసీ బోర్డు అంగీకరించిందన్న పేర్ని నాని.. ఈ బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా ఉన్నారని.. ఆయన కూడా విలీనానికి అంగీకరించారన్నారు.

Read Also: అసెంబ్లీ కమిటీలు.. వల్లభనేని వంశీకి ఛాన్స్

ఆర్టీసీ విభజన విషయంలో కేంద్రం చెప్పేది నిజమైతే.. ఏపీకి, తెలంగాణకు విడివిడిగా ఎలక్ట్రిక్ బస్సులను ఎలా కేటాయించిందని మంత్రి ప్రశ్నించారు.

Read Also: మందుబాబులకు షాక్ ఇచ్చిన జగన్!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.