యాప్నగరం

TTD: శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్.. టీటీడీ కీలక నిర్ణయం

టోకెన్లను మంగళవారం (జులై 21) నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటనలో తెలిపింది. మళ్లీ టోకెన్లను ఎప్పుడు జారీ చేసేది త్వరలోనే చెబుతామని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.

Samayam Telugu 21 Jul 2020, 6:50 am
తిరుమల శ్రీవారి భక్తులకు బ్యాడ్‌న్యూస్. దర్శనానికి సంబందించి టోకెన్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్ల జారీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపింది. అలపిరి భూదేవి కాంప్లెక్స్‌లో ఆఫ్‌లైన్‌ ద్వారా జారీ చేస్తున్న మూడు వేల శ్రీవారి సర్వదర్శనం టైంస్లాట్ టోకెన్లను మంగళవారం (జులై 21) నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటనలో తెలిపింది. మళ్లీ టోకెన్లను ఎప్పుడు జారీ చేసేది త్వరలోనే చెబుతామని.. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ కోరింది.
Samayam Telugu తిరుమల ఆలయం


తిరుపతిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.. ఆ కారణంతోనే టీటీడీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం నుంచి సంపూర్ణ ఆంక్షలు విధిస్తున్నట్లు కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా తెలిపారు. మంగళవారం నుంచి అత్య‌వ‌స‌ర సేవ‌లు, మెడిక‌ల్ షాపులు మిన‌హా మిగ‌తా షాపులు ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు మాత్ర‌మే అనుమ‌తి ఉంటుంద‌ని తెలిపారు. ఆ తర్వాత వాహ‌నాల‌కు కూడా అనుమ‌తించమని.. ఈ ఆంక్ష‌లు ఆగస్టు 5 వ‌ర‌కు కొన‌సాగుతాయ‌ని క్లారిటీ ఇచ్చారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.