యాప్నగరం

ఎంపీ విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులకు షాకిచ్చిన టీటీడీ

Vijayasai Reddy: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, శ్రీవారి ఆలయ మాజీ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులు టీటీడీ షాకిచ్చింది.

Samayam Telugu 16 Nov 2020, 4:10 pm
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ మాజీ ప్రధానార్చకుడు రమణ దీక్షితులు, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఎట్టలకేలకు షాకిచ్చింది. వీరిద్దరిపై గత తెలుగు దేశం పార్టీ హయాంలో వేసిన పరువు నష్టం కేసును ఉపసంహరించుకోవట్లేదని టీటీడీ స్పష్టం చేసింది. రమణదీక్షితులు, విజయసాయిరెడ్డిపై పరువు నష్టం కేసును వెనక్కి తీసుకునేలా టీటీడీ ప్రయత్నిస్తోందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి.
Samayam Telugu రమణ దీక్షితులు, విజయసాయిరెడ్డి


దీంతో ఈ విషయంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. విజయసాయిరెడ్డి, రమణ దీక్షితులపై ఉన్న పరువు నష్టం కేసును కొనసాగిస్తామని తిరుపతి పదో అదనపు జిల్లా జడ్జి వద్ద టీటీడీ సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. 2018లో వీరిద్దరిపై వేసిన పరువు నష్టం కేసును కొనసాగిస్తామని తెలిపింది. 2020లో దాఖలు చేసిన పరువు నష్టం కేసును వెనక్కు తీసుకునే పిటిషన్‌ను రద్దు చేసుకుంటున్నట్లు కోర్టుకు టీటీడీ తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.