యాప్నగరం

తిరుమలలో ప్రత్యక్షమైన శేఖర్ రెడ్డి.. సీఎం జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడు శేఖర్ రెడ్డి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. తాను చాలా సంవత్సరాలుగా శ్రీవారి సేవలో ఉన్నానని, తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆయన పేర్కొన్నారు.

Samayam Telugu 23 Sep 2019, 3:02 pm
చెన్నైకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త శేఖర్ రెడ్డి టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితులైన విషయం తెలిసిందే. సోమవారం టీటీడీ పాలక మండలి సభ్యుల సమావేశం జరగనుండడంతో ఆయన తిరుమల చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి వీఐపీ బ్రేక్ ప్రారంభ దర్శన సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు.
Samayam Telugu Tirumala_090615


అనంతరం ఆలయం వెలుపలకు వస్తూ శేఖర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తనకు టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుడిగా అవకాశం రావడంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తాను చాలా సంవత్సరాలుగా శ్రీవారి సేవలో ఉన్నానని శేఖర్ రెడ్డి అన్నారు. ప్రతి నిత్యం స్వామి, అమ్మవార్లకు బెంగళూరు నుంచి పుష్పాలు తెప్పించి సమర్పిస్తున్నానని, ఆరేళ్లుగా ఈ కార్యక్రమం కొనసాగిస్తున్నాన్నారు. అలిపిరి వద్ద ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న గోశాలకు రూ.15 కోట్లు నిధులు ఇచ్చానన్నారు. స్వామివారికి భక్తుడిగా ఇంకా ఎన్నో విరాళాలు ఇచ్చానన్నారు.

Must Read: కోడెల మృతి: ‘చంద్రబాబు.. ఈవెంట్ మేనేజ్‌మెంట్ అదుర్స్’

ఇదిలా ఉంటే గతంలో చంద్రబాబు బినామీ అంటూ ఆరోపణలు చేసిన వైఎస్సార్సీపీ.. అధికారంలోకి వచ్చాక శేఖర్ రెడ్డికి పదవి కట్టబెట్టడంపై పలువురు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వీటన్నింటిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఐటీ రైడ్స్ జరిగిన సమయంలో ఇంట్లో కేవలం రూ. 12 లక్షలు మాత్రమే దొరికాయని, కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని శేఖర్ రెడ్డి అన్నారు. అసత్య ప్రచారాలను ఆపేయాలని కోరారు.

Also Read: బాత్రూంలో బాబాయికి గుండెపోటు ఈవెంట్ సూపర్! ఎమ్మెల్సీ బుద్దా ఘాటు విమర్శలు

తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని శేఖర్ రెడ్డి అన్నారు. పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వారిని ఆ దేవుడే చూసుకుంటారని వ్యాఖ్యానించారు. దేవదేవుడికి సేవ చేసుకునే అవకాశం కల్పించాలని కోరానని, టీటీడీ పాలకమండలిలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించినందుకు సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.