యాప్నగరం

కరోనా కట్టడికి టీటీడీ ముందడుగు.. ఆయుర్వేద మందులు రెడీ

టీటీడీ ఆధ్వర్వంలో నడిచే ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, ఆయుర్వేద ఫార్మసీలు కలిసి ఐదు రకాల మందులు సిద్ధం చేశారు. రక్షజ్ఞధూపం, పవిత్ర, గండూషము, నింబనస్యం, అమత మాత్రలు రెడీ అయ్యాయి.

Samayam Telugu 9 Apr 2020, 11:50 am
కరోనా కట్టడి కోసం టీటీడీ ముందుడుగు వేసింది. ప్రభుత్వానికి తమవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చింది. ఈ మహమ్మారిని తరిమేసేందుకు ఆయుర్వేద మందుల తయారీ చేస్తోంది. టీటీడీ ఆధ్వర్వంలో నడిచే ఎస్వీ ఆయుర్వేద కళాశాల, ఎస్వీ ఆయుర్వేద ఆస్పత్రి, ఆయుర్వేద ఫార్మసీలు కలిసి ఐదు రకాల మందులు సిద్ధం చేశారు. రక్షజ్ఞధూపం, పవిత్ర, గండూషము, నింబనస్యం, అమత మాత్రలు రెడీ అయ్యాయి. వీటిని టీటీడీ జేఈవో బసంత్‌కుమార్‌ విడుదల చేశారు.
Samayam Telugu ttd


ఈ మందుల్ని టీటీడీ అన్న ప్రసాదం సిబ్బందికి అందజేశారు. కరోనా నివారణకు ఉపయోగపడే విడతల వారీగా పంపిణీ చేయనున్నట్ల అధికారులు చెబుతున్నారు. వీటిలో రక్షజ్ఞ ధూపం(క్రిమిసంహారక ధూపం), పవిత్ర (చేతులు శుభ్రం చేసుకునేందుకు ఉపయోగపడుతుంది), గండూషము (నోట్లో పోసుకుని పుక్కిలించే మందు), నింబనస్యము (ముక్కులో వేసుకునే చుక్కల మందు), అమృత (వ్యాధి నిరోధక శక్తి పెంచే మాత్ర)కు ఉపయోగపడతాయని టీటీడీ చెబుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.