యాప్నగరం

జగనోరిని అబద్ధాలు.. బాబోరి కథలు.. శ్రీకాకుళం యాసలో ఎంపీ, ఎమ్మెల్యే అదిరిపోయే పంచ్‌లు

రాష్ట్రంలో ఐటీ దాడుల దుమారం ఇంకా కొనసాగుతోంది. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మాజీ వ్యక్తిగత కార్యదర్శి శ్రీనివాసరావుపై ఐటీ దాడులు జరిగిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పీఎస్ శ్రీనివాసరావు వద్ద రూ.2 వేల కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయని వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రచారం చేశాయి. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ ఇంట్లో జరిపిన సోదాల్లో కేవలం రూ.2.63 లక్షల నగదు, 12 తులాల బంగారం మాత్రమే స్వాధీనం చేసుకున్నట్టు ఐటీ శాఖ తెలిపింది. దీంతో రూ. 2 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఐటీ పంచనామా నివేదిక తేల్చింది.

Samayam Telugu 16 Feb 2020, 7:30 pm

Samayam Telugu twitter war between tdp mp ram mohan naidu and ysrcp mla ambati rambabu
జగనోరిని అబద్ధాలు.. బాబోరి కథలు.. శ్రీకాకుళం యాసలో ఎంపీ, ఎమ్మెల్యే అదిరిపోయే పంచ్‌లు

అంబటి, రామ్మోహన్ మధ్య వార్

ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా టీడీపీ, వైసీపీ నాయకులు విమర్శలు, ప్రతివిమర్శలతో ఓ రేంజ్‌లో విరుచుకుపడుతున్నారు. తాజాగా, ఆదివారం శ్రీకాకుళం టీడీపీ ఎంపీ రామ్మోహన్‌నాయుడు, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. తొలుత ఎంపీ శ్రీకాళం మాండలికంలో జగన్‌పై విమర్శలు చేయగా.. ఎమ్మెల్యే రాంబాబు కూడా అదే సిక్కోలు యాసలో కౌంటర్ ఇచ్చారు.

​ఎంపీ రామ్మోహన్‌నాయుడు సెటైర్లు

‘‘జగనోరి ‘సాక్షి’ అబద్ధాలు అచ్చోసి కుమ్మబోతే, ఒడుపుగా ఒడిసిపట్టి దాని కొమ్ములిరిసి, దమ్ముంటే రమ్మనంటూ రొమ్ము విరిచి పిలిచినోడు.. మా చంద్రబాబు. అక్రమాల వారసుడు జగన్మోహనుడు తెలుగుదేశం ఎంట పడితే గుద్ది గుండ సేసినాడు మా చంద్రబాబు.’’ అంటూ రామ్మోహన్ నాయుడు ట్వీట్ చేశారు. వైసీపీవి తప్పుడు వార్తలని తేలిపోయాయంటూ హ్యాష్ ట్యాగ్ జోడించారు.

Twitter-Ram Mohan Naidu K

ఎమ్మెల్యే అంబటి కౌంటర్

‘‘బాబొరి కథలు అన్ని అల్లి చెపుతాడు .. రొమ్ము విరిచి చంద్రబాబు సంచులెన్నో మోసాడు కెమెరాలకి సిక్కి.. బిక్కిబిక్కి పరిగెత్తి ఆంధ్రకు వచ్చినాడు.. భ్రమారావతి చెప్పి బినామీ బాగుల్ని నింపినాడు.. ఎన్నికల్లో ప్రజలు ఎత్తి 23 ఇచ్చినారు, కోడుకేమో ఒడి పాయే.. పచ్చ మీడియాకి పిచ్చెక్కే’’ అంటూ వైసీపీ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. టీడీపీ తప్పుడు వార్తల ప్రచారం అంటూ హ్యాష్ ట్యాగ్ జోడించారు.

Twitter-Ambati Rambabu

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.