యాప్నగరం

అనంతపురం: అధికారుల నిర్లక్ష్యం.. కరెంట్ షాక్‌తో అన్నదమ్ములు మృతి

అనంతపురం జిల్లా ఉరవకొండలో కరెంట్ షాక్‌తో ఇద్దరు అన్నదమ్ములు ప్రాణాలు కోల్పోయిన ఘటన మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. బహిర్బూమికి వెళ్లి విద్యుద్ఘాతానికి గురయ్యారు.

Samayam Telugu 30 Jun 2020, 1:34 pm
అనంతపురం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఉరవకొండలో మంగళవారం ఉదయం ఇద్దరు యువకులు విద్యుద్ఘాతంతో మృతిచెందారు. ఉరవకొండలోని బాలాజీ థియేటర్‌ సమీపంలో నివసిస్తున్న రమేశ్‌, మల్లేశ్‌ అనే ఇద్దరు అన్నదమ్ములు వేకువజామున బహిర్భూమికి వెళ్లారు. ఈ సమయంలో ఓ నీటి ట్యాంక్‌ చుట్టూ ఉన్న ఇనుప కంచెను తాకారు. దానికి విద్యుత్‌ సరఫరా జరగడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. రమేశ్, మల్లేశ్‌లు విద్యుత్ షాక్‌తో విలవిలలాడుతూ ప్రాణాలు కోల్పోయారు.
Samayam Telugu అనంతపురంలో కరెంట్ షాక్‌తో అన్నదమ్ములు మృతి
Two Brothers dies in anantapur


వారు విగతజీవులుగా పడి ఉండటాన్ని గుర్తించిన కుటుంబసభ్యులు మృతదేహాలను అక్కడ నుంచి ప్రధాన రహదారికి తీసుకొచ్చి ఆందోళన చేపట్టారు. విద్యుత్‌ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని మృతుల బంధువులకు నచ్చజెప్పి ఒప్పించారు. అనంతరం మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉరవకొండ ఏఈ మురళీకృష్ణ సిబ్బందితో కలిసి ఘటనాస్థలాన్ని పోలీసులు పరిశీలించారు. ప్రమాదం విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.