యాప్నగరం

గుంటూరు: గోడల మధ్యలో ఇరుక్కుపోయిన చిన్నారులు

రెండు గోడల మధ్యలో ఇరుక్కుపోయిన ఇద్దరు చిన్నారులు.. ఊపిరి ఆడక ఇబ్బంది. వెంటనే గమనించి కాపాడిన స్కూల్ సిబ్బంది, స్థానికులు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఘటన.

Samayam Telugu 28 Feb 2020, 6:59 pm
ఎరక్కపోయి వచ్చాను.. ఇరుక్కుపోయాను అనే పాట గుర్తుందా.. ఆ టాపిక్ ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా. గుంటూరు జిల్లాలో ఇద్దరు పిల్లలకు ఇదే పరిస్థితి ఎదురైంది. పాపం పొరపాటున ఇద్దరు గోడ మధ్య ఇరుక్కుపోయారు.. అటు వెనక్కు వెళ్లలేక.. ఇటు ముందుకు రాలేక నానా తంటాలు పడ్డారు. చివరికి స్కూల్ సిబ్బంది, స్థానికులు రంగంలోకి దిగి వారిని రక్షించారు.
Samayam Telugu gnt.


తాడేపల్లిలోని నులకపేట ఉర్దూ స్కూల్ ప్రహరీ గోడ దగ్గర ఇద్దరు పిల్లలు ఆడుకుంటున్నారు. పొరపాటున ప్రహరీ గోడ, మరో గోడకు మధ్య ఇరుక్కుపోయారు. ఇద్దరికి ఊపిరి ఆడకపోవడంతో ఇబ్బందిపడ్డారు. కొద్దిసేపటి తర్వాత స్కూల్ సిబ్బంది, స్థానికులు గమనించారు.. వెంటనే అక్కడికి చేరుకుని పిల్లల్ని అతి కష్టం మీదకు బయటకు లాగారు. ఈ ప్రమాదంలో ఇద్దరు చిన్నారులకు స్వల్ప గాయాలు అయ్యాయి.

గోడల మధ్యలో ఇరుక్కుపోయిన ఇద్దరు పిల్లల్ని రమణబాబు, మున్నాలుగా స్థానికులు గుర్తించారు. అయితే పిల్లలు గోడల మధ్య ఎలా ఇరుక్కుపోయారన్నది ఆసక్తిగా మారింది. తల్లిదండ్రులు ఇలా నిర్లక్ష్యంగా ఇద్దరు పిల్లల్ని వదిలి వెళ్లిపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు. ఈ ఘటనపై తాడేపల్లి పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.