యాప్నగరం

విశాఖ: పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం.. ఇద్దరు మృతి

పరవాడ ఫార్మాసిటీలో వరుసగా ప్రమాదాలు.. రెండు రోజుల్లో ముగ్గురు మృతి. కార్మికుల్లో ఆందోళన.. ప్రమాదం జరిగినా బయటకు రాకుండా దాచి ఉంచారని మండిపడుతున్న కార్మికులు.

Samayam Telugu 27 Dec 2019, 9:42 am
విశాఖ పరవాడ ఫార్మాసిటీలో వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా స్మైలెక్స్ ఫార్మాలో కెమికల్ గ్యాస్ లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు చనిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన మరో కార్మికుడిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి కూడా విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఈ వరుస ప్రమాదాలతో.. గత రెండు రోజుల్లో ముగ్గురు చనిపోగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Samayam Telugu vsp.


స్మైలెక్స్ ప్రమాదమే కాదు.. పరవాడలోని విజయశ్రీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో కూడా బుధవారం ప్రమాదం జరిగింది. పరిశ్రమలోlr ప్రొడక్షన్‌ బ్లాక్‌ – 1లోని రియాక్టర్ దగ్గర కొత్త బ్యాచ్‌ను సిద్ధం చేస్తున్న సమయంలో.. కార్మికులు కెమికల్స్ కలుపుతున్నారు. అదే సమయంలో ఒక్కసారిగా విషవాయువులు గుప్పమన్నాయి. ఆ దెబ్బకు అక్కడే ఉన్న ముగ్గురు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సమీపంలో ఉన్న మరో ఇద్దరు కూడా అస్వస్థతకు గురైన తేరుకున్నారు. బాధితుల్ని హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. వారిలో చికిత్స పొందుతూ శ్రీధర్‌ చనిపోయాడు. మిగిలిన ఇద్దరు మెల్లిగా కోలుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రెండు రోజుల్లోనే ముగ్గురు ఇలా ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకు గురి చేస్తోంది. పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికులకు భద్రతపై నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. యజమాన్యాలు కార్మికుల కోసం సరైన భద్రతా ప్రమాణాలను పాటించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాదు విజయశ్రీ ఆర్గానిక్స్ పరిశ్రమలో ప్రమాదం బయటకు రాకుండా యాజమాన్యం రహస్యంగా ఉంచడంపై కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని.. ప్రమాదాల్లో చనిపోయిన కార్మికులకు నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.