యాప్నగరం

తోడి కోడళ్ల పంచాయితీ : ఏపీ, తమిళనాడులో రెండు గ్రామాల మధ్య కొట్లాట

ఇరు గ్రామాల ప్ర‌జలు పోలీస్ స్టేషన్ స‌మీపంలో పంచాయితీ పెట్టి కొట్లాటకు దిగారు.. ఈ గొడవల్లో ప‌లువు‌రురికి గాయాల‌య్యాయి. ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

Samayam Telugu 15 Aug 2020, 1:00 pm
తోడి కోడళ్ల మధ్య మొదలైన గొడవ రెండు రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల మధ్య చిచ్చు పెట్టింది. ఇరు గ్రామాల ప్ర‌జలు పోలీస్ స్టేషన్ స‌మీపంలో పంచాయితీ పెట్టి కొట్లాటకు దిగారు.. ఈ గొడవల్లో ప‌లువు‌రురికి గాయాల‌య్యాయి. చిత్తూరు జిల్లా యాదమరి మండలం పచ్చయప్పవూరుకు చెందిన పరమేశ్వరి, హేమలత తోడి కోడళ్లు. ఇళ్లు కూడా పక్క,పక్కనే.. పొలం కూడా అంతే. ఇళ్లు, పొలాలు పక్కనే ఉండటంతో తరచూ గొడవలు జరుగుతూనే ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఆ గొడవలు మరింత ముదిరాయి.
Samayam Telugu చిత్తూరు జిల్లా


ఈ వ్యవహారం మెల్లిగా పెద్దల దగ్గరకు చేరింది. తోడి కోడళ్ల స్వగ్రామాలైన తమిళనాడులోని అంకణాపల్లి, పూతలపట్టు మండలం చిన్నబండపల్లి గ్రామాల్లో వారి తరపున బంధువులు వచ్చారు. ఇరు వర్గాలు యాదమ పోలీస్ స్టేషన్ దగ్గర పంచాయితీ పెట్టారు. అందరూ కూర్చొని మాట్లాడుతున్న సమయంలో రెండు వర్గాల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇద్దరి మాటామాటా పెరిగి బాహాబాహీకి దిగారు. తర్వాత ఘర్షణ జరిగింది.. ఒకరిపై మరొకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘ‌ర్ష‌ణ‌లో పలువురికి గాయాలయ్యాయి. పక్కనే ఉన్న పోలీసులు వారిని సముదాయించే ప్రయత్నం చేసిన లాభం లేకుండా పోయింది. తర్వాత గాయాలైన వారిని ఆస్పత్రికి తరలించారు. ఇరువర్గాలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.