యాప్నగరం

యూత్ కోరికను కాదనలేక సరదాగా స్టెప్పులేసిన ఆ ఎమ్మెల్యే చివరకు.. పోలీస్ స్టేషన్‌కు..

Ganpati Immersion | వినాయకుడి ఊరేగింపు సందర్భంగా సరదాగా స్టెప్పులేసిన ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. ఎమ్మెల్యే అయిన నా పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుడి పరిస్థితేంటని వాపోయారు.

Samayam Telugu 10 Sep 2019, 4:14 pm
వినాయక నిమజ్జనం సందర్భంగా ఊరేగింపు వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యేను అభిమానులు డ్యాన్స్ చేయాలని బలవంతం చేశారు. దీంతో వారిని చిన్నబుచ్చడం ఇష్టం లేక ఆయన కూడా సరదాగా స్టెప్పులేశారు. ఇదే పెద్ద తప్పయిపోయింది. రాజకీయ ప్రత్యర్థులు ఆ వీడియోను ఎడిట్ చేసే ఎమ్మెల్యేపై దుష్ప్రచారానికి దిగారు. ఇంతకూ ఎవరా ఎమ్మెల్యే? ఏంటా కథా? తెలుసుకుందాం..
Samayam Telugu undi mla


ఇటీవలి ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి టీడీపీ తరఫున గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో మంతెన రామరాజు ఒకరు. ఉండి ఎమ్మెల్యే అయిన ఆయన.. గత శనివారం (సెప్టెంబర్ 7న) ఉండి మండలం చిలుకూరు, మహదేవపట్నం గ్రామాల్లో పర్యటించారు. అదే సమయంలో వినాయకచవితి ఊరేగింపు ఉండటంతో.. యువత ఆయన్ను డ్యాన్స్ చేయాలని కోరారు. ఎమ్మెల్యే కూడా కాసేపు స్టెప్పులేశారు.

కానీ వీడియోను ఎడిట్ చేసిన కొందరు వ్యక్తులు తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా దుష్ప్రచారం చేస్తున్నారని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కాళ్ల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రవి వర్మకు ఫిర్యాదు చేసిన ఆయన.. ఎమ్మెల్యే పరిస్థితే ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని వాపోయారు. పాపం రాజుగారు.. డ్యాన్స్ చేసి ఇలా పోలీస్ స్టేషన్ మెట్లెక్కారని టీడీపీ అభిమానులు బాధపడుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.