యాప్నగరం

ఏపీలో 3, తెలంగాణలో 5 జిల్లాలు లాక్‌డౌన్.. సేవలన్నీ బంద్!

Coronavirus in AP: దేశంలో 75 జిల్లాలను లాక్ డౌన్ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో ఏపీలో మూడు, తెలంగాణలో ఐదు జిల్లాలు ఉన్నాయి.

Samayam Telugu 22 Mar 2020, 7:00 pm
దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ (కోవిడ్ 19) వ్యాపించిన జిల్లాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కోవిడ్ 19 ప్రభావం ఉన్న దేశంలోని 75 జిల్లాలను లాక్‌ డౌన్‌ ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. ఈ నెల 31 వరకు లాక్‌ డౌన్‌ కొనసాగుతుందని పేర్కొంది. లాక్ డౌన్ రోజుల్లో అత్యవసర సేవలు మినహా మిగతావన్నీ మూసివేయనున్నట్లు ప్రకటించింది.
Samayam Telugu pjimage - 2020-03-22T183929.171


ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 75 జిల్లాల జాబితాను విడుదల చేసింది. ఇందులో తెలంగాణలోని 5 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్‌లో 3 జిల్లాలు ఉన్నాయి. ఏపీలో కృష్ణా, విశాఖ, ప్రకాశం జిల్లాలు, తెలంగాణలో హైదరాబాద్‌, మేడ్చల్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో కరోనా వైరస్‌ ప్రభావం ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర, కేరళలోని 10 జిల్లాల్లో కరోనా ప్రభావం ఉన్నట్లు కేంద్రం పేర్కొంది. మరోవైపు కరోనా నియంత్రణకు దేశవ్యాప్తంగా తలపెట్టిన జనతా కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతోంది. ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. సాయంత్రం 5 గంటల సమయంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చి కరోనా నియంత్రణకు పాటుపడుతున్న వైద్యులు, పారిశుద్ధ్య సిబ్బందికి చప్పట్లు కొడుతూ సంఘీభావం ప్రకటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.