యాప్నగరం

విశాఖ, విజయవాడవాసులకు శుభవార్త.. కేంద్రం గ్రీన్ సిగ్నల్

కేంద్రం ఏపీకి గుడ్‌న్యూస్ చెప్పింది.. రాష్ట్రవ్యాప్తంగా పలు రహదారుల నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇటీవల మంత్రి మంత్రి శంకరనారాయణ, అధికారులు ప్రతిపాదనలతో గడ్కరీని కలిశారు. ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి, వాటి నిర్మాణానికి ఓకే అన్నారు.

Samayam Telugu 26 Dec 2020, 10:43 am
ఏపీలో రోడ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. విశాఖ భీమిలి నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు కొత్తగా గ్రీన్‌ఫీల్డ్‌ రహదారి నిర్మాణానికి కేంద్రం ఓకే చెప్పింది. విశాఖ బీచ్‌రోడ్‌ నుంచి భీమిలి వరకు రహదారి ఉండగా.. దీన్ని మరింత అభివృద్ధి చేయడంతోపాటు, భీమిలి నుంచి కొత్త మార్గం రానుంది. సముద్ర తీరం పక్క నుంచి.. ఎక్కువ భాగం బ్రిడ్జిపై ప్రయాణం సాగేలా ఈ రోడ్ ఉంటుంది. విశాఖ పోర్టు నుంచి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ కలిపే ఈ రోడ్డు ప్రతిపాదనకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌గడ్కరీ అంగీకారం తెలిపారు. ఇటీవల మంత్రి మంత్రి శంకరనారాయణ, అధికారులు ప్రతిపాదనలతో గడ్కరీని కలిశారు. ఆ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపి, వాటి నిర్మాణానికి ఓకే అన్నారు.
Samayam Telugu విశాఖ, విజయవాడలకు శుభవార్త


విజయవాడకు తూర్పువైపు నిర్మించ తలపెట్టిన మరో బైపాస్‌కు సంబంధించి.. ఏలూరు వైపు గన్నవరం పొట్టిపాడు నుంచి కృష్ణానది మీదుగా గుంటూరు జిల్లాలోని కాజా వరకు నాలుగు వరుసలతో నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భూసేకరణకు అయ్యే వ్యయాన్ని ఎన్‌హెచ్‌ఏఐ భరించనుంది. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి వినియోగించే ఇసుక, మట్టి, కంకర వంటి మెటీరియల్ సీనరేజ్‌ ఫీజు.. సిమెంట్‌, స్టీల్‌పై రాష్ట్ర జీఎస్టీ మినహాయింపునకు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది.

ఇటు కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి చెళ్లకెరె, పావగడ మీదగా అనంతపురం జిల్లాలోని పెనుకొండ వరకు జాతీయ రహదారికి ఆమోదం తెలపడంతోపాటు దీనిని పెనుకొండ నుంచి పుట్టపర్తి వరకు పొడిగింపు ప్రతిపాదనకు ఓకే చెప్పారు. రాష్ట్రంలో నేషనల్, స్టేట్ రోడ్లలో రైల్వే క్రాసింగ్‌లు ఉండగా, వీటిపై నిర్మించే ఆర్‌వోబీలకు రాష్ట్ర వాటా బదులు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ నిధులు వెచ్చించేందుకు అంగీకారం తెలిపారు. నాగార్జునసాగర్‌ నుంచి దాచేపల్లి, నర్సరావుపేట మీదుగా చిలకలూరిపేట వరకు ఉన్న రాష్ట్ర రహదారిని, జాతీయ రహదారిగా మార్చేందుకు అంగీకారం తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.