యాప్నగరం

కేంద్రం సంచలన నిర్ణయం.. చంద్రబాబుకి NSG భద్రత తొలగింపు

టీడీపీ అధినేత చంద్రబాబు సహా 13మందికి ఎన్‌ఎస్‌జీ సిబ్బందితో కల్పిస్తున్న భద్రతను ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయం. పారా మిలిటరీ దళాలతో భద్రతను కల్పించూ ఆలోచనలో కేంద్రం.

Samayam Telugu 13 Jan 2020, 12:25 pm
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. వీఐపీలకు రక్షణ కల్పించే బ్లాక్ క్యాట్ భద్రతను ఉపసహరించాలని నిర్ణయించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా 13మందికి సెక్యూరిటీని ఉపసంహరించనున్నారు. కేంద్ర హోంశాఖ వర్గాల సమాచారం మేరకు.. ఎన్‌ఎస్‌జీ ఇకపై కౌంటర్ టెర్రరిస్ట్, యాంటీ హైజాక్ వంటి తమ ప్రధాన విధులపై ఫోకస్ పెట్టనున్నాయట. అంతేకాదు కొంతమంది వీఐపీలకు ఎన్‌ఎస్‌జీతో భద్రత కల్పించడం కాస్త భారంగా కూడా మారిందట. అందుకే ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ వీఐపీలకు ఎన్‌ఎస్‌జీ సెక్యూరిటీని తొలగించి.. పారా మిలిటరీ దళాలతో భద్రతను కల్పించాలని భావిస్తున్నారట.
Samayam Telugu security.


Read Also: పోలీసులకు అమరావతి రైతుల షాక్.. సంచలన నిర్ణయం

ఎన్‌ఎస్‌జీ కమాండోలు కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, శర్వానంద సోనోవాల్, మాయావతి, ఫరూక్ అబ్దుల్లా, అద్వానీ, ములాయం సింగ్ యాదవ్, ప్రకాశ్ సింగ్ బాదల్‌లు ఉన్నారు. వీరికి ఒక్కొక్కరి 25మంది బ్లాక్ క్యాట్ కమాండోలను కేటాయిస్తున్నారు. ఇప్పుడు వీరికి భద్రతను తగ్గిస్తే.. దాదాపు 450మంది ఎన్‌ఎస్‌జీ కమాండోలు అందుబాటులోకి వస్తారు. వీరిని పరిస్థితిని బట్టి అత్యవసర సమాయాల్లో భద్రత కోసం ఉపయోగించుకోవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. అంతేకాదు ఎన్డీఏ సర్కార్ ఇటీవలే పలువురు వీఐపీలకు భద్రతను ఎస్పీజీ తగ్గించిన సంగతి తెలిసిందే.

ఈ ఎన్‌ఎస్‌జీని యాంటీ టెర్రరిస్ట్, యాంటీ హైజాక్‌ఆపరేషన్ల కోసం 1984లో ఏర్పాటు చేశారు. తర్వాత ప్రముఖుల భద్రత కోసం కేటాయించారు. కానీ వీఐపీల భద్రత తమకు సంబంధం లేదని అధికారులు చెబుతున్నారట.. ఈ అదనపు బాధ్యతలు భారంగా మారాయనేది వారి వాదన. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో కమాండలో అవసరం ఉండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.