యాప్నగరం

విశాఖ: ఇది దేశం చేసుకున్న అదృష్టం.. సృజనపై కేంద్రమంత్రి ప్రశంసలు

కరోనాపై యుద్ధంలో పోరాడేందుకు ఇటువంటి యోధులు ఉండడం మన దేశం చేసుకున్న అదృష్టం. విధుల పట్ల నిబద్ధత చూపుతున్న ఇలాంటి వారు ఓ ఉదాహరణ.

Samayam Telugu 13 Apr 2020, 4:12 pm
విశాఖ జీవీఎంసీ కమిషనర్ సృజన గుమ్మళ్ళపై కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రశంసలు కురిపించారు. కరోనాసై యుద్ధంలో ఆమె అందిస్తున్న సేవల్ని.. విధి నిర్వహణలో చూపిస్తోన్న నిబద్ధతను ట్విట్టర్ వేదికగా కొనియాడారు. 'కరోనాపై యుద్ధంలో పోరాడేందుకు ఇటువంటి యోధులు ఉండడం మన దేశం చేసుకున్న అదృష్టమని వ్యాఖ్యానించారు. విధుల పట్ల నిబద్ధత చూపుతున్న ఇలాంటి వారు ఓ ఉదాహరణగా నిలుస్తున్నారు. సృజనకు హృదయపూర్వక శుభాకాంక్షలు' అన్నారు కేంద్రమంత్రి.
Samayam Telugu srijana.

కరోనా వంటి కష్టకాలంలో జీవీఎంసీ కమిషనర్ సృజన కూడా ఇలాంటి క్లిష్టమైన సమయంలో తన అంకితభావాన్ని చాటుకున్నారు. వాస్తవానికి సృజన నెల రోజుల క్రితం మగబిడ్డకు జన్మనిచ్చారు. చిన్నారి ఆలనాపాలనా చూసుకోవాల్సిన ఆమె.. సెలవుల్ని వదిలేశారు. ప్రజలో కోసం, కరోనా నివారణ కోసం విధుల్లో చేరారు. మొదటి మూడు వారాలు సృజన తన బిడ్డను ఇంట్లోనే వదిలేసి ఆఫీసుకు వచ్చారు. పిల్లవాడి బాగోగుల్ని భర్త, తల్లికి వదిలేశారు. తర్వాత పరిస్థితిలు అనుకూలించకపోవడంతో తన నెల రోజుల పసికందుతో విధులకు హాజరవుతున్నారు.. ప్రతిరోజు అధికారులు, సిబ్బందితో సమీక్ష చేస్తున్నారు.ఆమె ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది.. కమిషనర్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.