యాప్నగరం

నెల్లూరు: వెంకటేశ్వర స్వామి రథానికి నిప్పు

వెంకటేశ్వర స్వామి రథానికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు. మంటల్లో కాలిబూడిదైన రథం.. ఘటనపై ఏపీ దేవాదాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం.. విచారణ జరిపి నిందితుల్ని కఠినంగా శిక్షించాలని ఆదేశం.

Samayam Telugu 14 Feb 2020, 11:25 am
నెల్లూరు జిల్లాలో వెంకటేశ్వర స్వామి రథానికి నిప్పు పెట్టడం కలకలంరేపింది. బోగోలు మండలం బిట్రగుంట కొండపై శ్రీప్రసన్న వెంకటేశ్వర స్వామి రథం తెల్లవారు జామున దగ్ధమైంది. ఆలయ ఆవరణలో నిలిపి ఉంచిన రథంపై మంటలు చెలరేగడంతో స్థానికులు గుర్తించారు. వెంటనే ఆర్పేందుకు ప్రయత్నించారు. అప్పటికే మంటలు వ్యాపించి రథం పూర్తిగా కాలిపోయింది.
Samayam Telugu nlr.


రథానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టి ఉంటారని గ్రామస్థులు చెబుతున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారికి రథోత్సవం నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలు మార్చి 4 నుంచి ప్రారంభంకానుండగా.. ఈ ఘటన జరగడంతో భక్తులు షాకయ్యారు. సంఘటనా స్థలాన్ని కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, బిట్రగుంట ఎస్సై భరత్ కుమార్ పరిశీలించారు.

ఇదిలా ఉంటే రథానికి నిప్పు పెట్టిన ఘటనపై దేవదాయ శాఖ మంత్రి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడారు. దుండగులెవరో తక్షణం గుర్తించి.. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఘటనపై తక్షణ చర్యలు చేపట్టాలని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉషారాణినికి సూచించారు. అలానే ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.