యాప్నగరం

ఇంగ్లిష్ మీడియంపై ఉపరాష్ట్రపతి సంచలన వ్యాఖ్యలు

ఇంగ్లిష్ మీడియం విద్యపై ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ఏ మీడియంలో చదివి ఆ స్థాయికి చేరారని ప్రశ్నించారు.

Samayam Telugu 8 Feb 2020, 11:19 pm
రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంగ్లిష్ మీడియాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరూ మాతృభాషలోనే చదువుకోవాలని పిలుపునిచ్చారు. విశాఖలోని గీతం విశ్వవిద్యాలయంలో జరిగిన పుస్తకావిష్కరణ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
Samayam Telugu venkaiah


తనకు కాన్వెంట్ అంటే ఏంటో తెలియదని, అందరూ మాతృభాషలో చదువుకోవాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కోరారు. ఇంగ్లిష్ కూడా అవసరమేనని, కాని తెలుగు మాత్రం తనకు ప్రాణమన్నారు. మాతృభాష కళ్లు లాంటిదని, పరాయి భాష కళ్లజోడు వంటిదని వ్యాఖ్యానించారు. ఏ మీడియంలో చదివారని రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతి, నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారని ప్రశ్నించారు.

విద్యాసంస్థలు పిల్లలకు విద్యతో పాటు వినయం, సంస్కరాన్ని కూడా నేర్పాలని ఉపరాష్ట్రపతి కోరారు. విద్యా వ్యవస్థలో గణనీయమైన మార్పు రావాల్సి ఉందన్నారు. పిల్లలకు భారతీయ చరిత్ర, సంస్కృతి, సాంప్రదాయాలను బోధించాలని సూచించారు. సీఏఏ సహా అన్ని చట్టాలపై దేశవ్యాప్తంగా ప్రజలు అధ్యయనం చేయాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.