యాప్నగరం

కొత్తగా ఎన్నికైన వైసీపీ ఎంపీలకు కీలక పదవులు.. ఉపరాష్ట్రపతి ఉత్తర్వులు

కొత్తగా ఎన్నికైనల వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులకు వివిధ కమిటీల్లో చోటు కల్పించారు.. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు.

Samayam Telugu 24 Jul 2020, 7:54 am
ఏపీ నుంచి కొత్తగా రాజ్యసభకు ఎన్నికైన వైఎస్సార్‌సీపీ ఎంపీలకు కీలక పదవులు దక్కాయి. వీరికి వివిధ కమిటీల్లో చోటు కల్పించారు.. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. మోపిదేవి వెంకటరమణకు కోల్ అండ్ స్టీల్ కమిటీలో.. పిల్లి సుభాష్ చంద్రబోస్‌కు పరిశ్రమల కమిటీలో.. అయోధ్య రామిరెడ్డికి పట్టాణాభివృద్ది కమిటీలో.. పరిమళ్ నత్వానీకి ఐటీ కమిటీలో చోటు కల్పించారు.
Samayam Telugu వైసీపీ ఎంపీలు


ఇక రాజ్యసభకు ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన 45 మంది రాజ్యసభ సభ్యులకు ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో అవకాశం కల్పించారు. అందరినీ వివిధ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలకు నామినేట్ చేశారు. దిగ్విజయ్ సింగ్‌కు పట్టణాభివృద్ధి.. జ్యోతిరాదిత్య సింధియాను హెచ్‌ఆర్‌డీకి.. శరద్ పవార్‌కు రక్షణ విభాగానికి.. మల్లికార్జున ఖర్గేకు వాణిజ్య విభాగానికి నామినేట్ చేశారు. దేవెగౌడకు రైల్వే.. రంజన్ గొగోయ్‌కు విదేశాంగ వ్యవహారాల విభాగానికి నామినేట్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.