యాప్నగరం

ఏపీలో రక్త నిల్వలు తగ్గుతున్నాయి.. విజయసాయిరెడ్డి ఆందోళన

లాక్ డౌన్ వల్ల బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు అడుగంటాయి. శస్త్రచికిత్సలు అవసరమైన రోగులు, హెమోఫీలియా, తలస్సీమియా వ్యాధులున్న చిన్నారులు ప్రాణాపాయ స్థితికి వెళ్తున్నారు.

Samayam Telugu 18 Apr 2020, 8:55 am
కరోనా ఎఫెక్ట్ అన్ని రంగాలపై.... అన్ని వ్యవస్థలపై చూపిస్తోంది. తాజాగా రక్తానికి కూడా కొరత ఏర్పడింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో దేశ వ్యాప్తంగా ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. తాజాగా లాక్ డౌన్‌ను మరో 19 రోజుల పాటు పెంచారు. అయితే అదే సమయంలో ఎవరికైనా కరోనా ఉండే ప్రమాదం ఉందని రక్తాన్ని సేకరించేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం లేదు. డోనర్స్ కూడా ముందుకు రక్తం ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు. ఇప్పటికే బ్లడ్‌ బ్యాంకుల్లో నిల్వలు తగ్గిపోతున్నాయి. బ్లడ్‌ అత్యవసరమై వచ్చిన వారికి బ్లడ్‌ బ్యాంక్‌‌‌ల నిర్వాహకులు అందించలేకపోతున్నారు.
Samayam Telugu universal-blood


ఇదే పరిస్థితి కొనసాగితే ఎమర్జెన్సీ కేసుల్లో ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడతాయని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటు ఏపీలోనూ పరిస్థితి అలాగే ఉంది. స్వయంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డియే ఈ విషయాన్ని ట్వీట్ ద్వారా తెలిపారు. ‘రక్తదానం చేయగలిగిన వారంతా ఈ ఆపత్కాలంలో పెద్ద మనసుతో ముందుకు రావాలి. లాక్ డౌన్ వల్ల బ్లడ్ బ్యాంకుల్లో రక్తం నిల్వలు అడుగంటాయి. శస్త్రచికిత్సలు అవసరమైన రోగులు, హెమోఫీలియా, తలస్సీమియా వ్యాధులున్న చిన్నారులు ప్రాణాపాయ స్థితికి వెళ్తున్నారు. దేశమంతటా ఇదే పరిస్థితి ఉంది.’ అంటూ ఆయన సోషల్ మీడియా వేదికగా తెలిపారు.

తలసేమియా, సికిల్‌సెల్‌ ఎనీమియా వ్యాధులతో బాధపడే పేషెంట్లకు ప్రతి నెలా కచ్చితంగా రక్తం ఎక్కించాలి. ప్రస్తుతం వీరికి ఎమర్జెన్సీ డెలివరీ కేసులకు మాత్రమే బ్లడ్ ఇస్తున్నామని పలు బ్లడ్ బ్యాంకుల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక వీరితో పాటు కేన్సర్ పేషెంట్లకు కూడా తెల్లరక్తకణాలు అవసరమవుతాయి. ముందు ముందు కూడా పరిస్థితి ఇలాగే కొనసాగితే... ఇలాంటి వారి ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.