యాప్నగరం

విజయవాడ: దుర్గా దేవిగా, మహిషాసురమర్ధినీదేవి రూపంలో దర్శనం

అష్టమి, నవమి తిథులు ఉండటంతో రెండు అలంకారాల్లో కనువిందు చేయనున్నారు. ఉదయం దుర్గాష్టమిని పురస్కరించుకొని దుర్గాదేవిగా, మధ్యాహ్నం నుంచి మహిషాసురమర్ధినీదేవిగా అమ్మ దర్శనమిస్తారు.

Samayam Telugu 24 Oct 2020, 11:00 am
Samayam Telugu విజయవాడ దుర్గమ్మ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవ రాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం దుర్గమ్మ రెండు ప్రత్యేక అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. అష్టమి, నవమి తిథులు ఉండటంతో రెండు అలంకారాల్లో కనువిందు చేయనున్నారు. ఉదయం దుర్గాష్టమిని పురస్కరించుకొని దుర్గాదేవిగా, మధ్యాహ్నం నుంచి మహిషాసురమర్ధినీదేవిగా అమ్మ దర్శనమిస్తారు. లోక కంటకుడైన దుర్గమాసురుడిని అష్టమి తిథినాడు వధించి ఇంద్రకీలాద్రిపై స్వయంగా అమ్మవారు ఆవిర్భవించారు. మధ్యాహ్నం అమ్మవారు శ్రీ మహిషాసురమర్ధని దేవీగా భక్తులకు దర్శనమిస్తారు. అష్టబుజాలతో అవతరించి సింహవాహినియై, దుష్టుడైన మహిషాసురుడిని సంహరించి దేవతలు, ఋషులు, మానవుల కష్టాలను తొలగించింది ఈ తల్లే... ఇంద్రకీలాద్రిపై వేంచేసిన శ్రీకనకదుర్గమ్మ వారి నిజ స్వరూపం కూడా ఇదే కావడం విశేషం.

మరోవైపు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లు కృష్ణానదిలో విహరిస్తారు. ఆదివారం తెప్పోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కలెక్టర్‌ నుంచి అనుమతి రావాల్సి ఉంది.. ఇప్పటి వరకు ట్రయిల్‌ రన్‌ కూడా నిర్వహించేందుకు సాధ్యపడ లేదు. దీనిపై నేడు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం నదిలో నీటి ప్రవాహం అధికంగా ఉండటం, ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో తెప్పోత్సవం నిర్వహణపై జిల్లా కలెక్టర్‌తో దేవస్థాన అధికారులు చర్చిస్తున్నారు. ఒక వేళ తెప్పోత్సవం సాధ్యం కాకపోతే శ్రీ గంగా పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి వార్ల ఉత్సవ మూర్తులను హంస వాహనంపై ఉంచి మూడుసార్లు వాహనాన్ని ముందుకు వెనక్కు తిప్పుతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.