యాప్నగరం

విజయవాడలో గ్యాంగ్ వార్.. కత్తులతో రెచ్చిపోయిన రెండు గ్రూపులు..!

బెజవాడలో విద్యార్థులు రౌడీ మూకల్లా రెచ్చిపోయి నడిరోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు. పటమటలో రెండు విద్యార్థి గ్రూపులు కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు దిగాయి.

Samayam Telugu 31 May 2020, 9:46 pm
విజయవాడలో కాలేజీ విద్యార్థులు రౌడీ మూకల్లా రెచ్చిపోయారు. నడిరోడ్డుపై కత్తులతో వీరంగం సృష్టించారు. పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వివాదం తలెత్తగా.. కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పర దాడులకు దిగారు. దీంతో బెజవాడ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. దాడిలో గాయపడ్డ వారిని విజయవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. గ్యాంగ్‌వార్‌లో రాజకీయ పార్టీ నేతల అనుచరులు ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
Samayam Telugu విజయవాడలో గ్యాంగ్ వార్


Also Read: 5 రోజుల్లోనే పింఛన్ మంజూరు, ఏడాది పొడవునా.. జగన్ సర్కార్ కీలక సంస్కరణ

అయితే విద్యార్థుల గ్యాంగ్ వార్‌కు యనమలకుదురులోని రూ. 2 కోట్ల విలువైన భూమి కారణమని తెలుస్తోంది. ల్యాండ్ డీల్‌కు సంబంధించి రెండు గ్రూపులు జోక్యం చేసుకోవడంతో వివాదం మొదలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రెండు గ్రూపులకు చెందిన 30 మందికి పైగా కాలేజీ విద్యార్థులు కత్తులు, కర్రలతో ఒకరిపై మరొకరు దాడులకు తెగబడ్డారు. దీంతో పలువురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ వివాదంలో మాజీ రౌడీషీటర్‌ జోక్యం చేసుకున్నారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో రాజకీయ పార్టీల నేతల అనుచరుల ప్రమేయం కూడా ఉందని వార్తలు వస్తున్న తరుణంలో పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.

Also Read: శ్రీశైలం దేవస్థానంలో భారీ కుంభకోణం.. సంచలన విషయాలు వెలుగులోకి..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.