యాప్నగరం

బెజవాడవాసులకు అలర్ట్.. ఆరు రోజులు ఆ మార్కెట్ బంద్

వ్యాపారులు అధికారుల్ని కలిసి షాపులు, మార్కెట్లు మూసేస్తున్నారు. అత్యవసరమైన షాపులు మినహా మిగిలినవి మూతవేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. విజయవాడలోనూ వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

Samayam Telugu 13 Jul 2020, 9:52 am
ఏపీని కరోనా వైరస్ వెంటాడుతూనే ఉంది. కేసుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్రలోనూ కేసులు గణనీయంగా పెరుగుతూనే ఉన్నాయి. టెస్టుల సంఖ్య పెంచే కొద్ది కేసులు బయటపడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కొన్ని నగరాలు, పట్టణాల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది. దీంతో వ్యాపారులు అధికారుల్ని కలిసి షాపులు, మార్కెట్లు మూసేస్తున్నారు. అత్యవసరమైన షాపులు మినహా మిగిలినవి మూతవేయాలని నిర్ణయం తీసుకుంటున్నారు. విజయవాడలోనూ వ్యాపారులు కీలక నిర్ణయం తీసుకున్నారు.
Samayam Telugu విజయవాడ


కృష్ణా జిల్లా విజయవాడలో కూడా కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. విజయవాడ సమీపంలోని గొల్లపూడి మార్కెట్‌ సోమవారం నుంచి (జూలై 13) నుంచి ఆరు రోజుల పాటు మూతపడనుంది. మార్కెట్లో ఎక్కువ‌గా క‌రోనా కేసులు ఉండ‌టంతో.. ఈ నెల 18 వ‌ర‌కు మార్కెట్ మూతపడనుంది. గొల్లపూడి హోల్‌సేల్‌ మార్కెట్‌ నుంచి వేర్వేరు ప్రాంతాలకు, రాష్ట్రాలకు సరుకులు ఎగుమతి, దిగుమతి అవుతుంటాయి. కొన్నిచోట్ల వ్యాపారులే స్వచ్ఛందంగా లాక్ డౌన్ ను విధించుకుంటున్నారు. వ్యాపార సముదాయాలు మూసి ఉంచుతున్నారు.. ఉదయం 6 నుంచి 10 గంటల వరకే వ్యాపారాలకు అనుమతులు ఇచ్చారు. దీంతో ఈ మార్కెట్ లాక్‌డౌన్ ప్ర‌భావం.. ఇత‌ర మార్కెట్లపై సైతం ప‌డ‌నుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.