యాప్నగరం

హిట్లర్ కంటే హీనం.. సీఎం సీటు పర్మినెంట్ కాదు: కేశినేని

చంద్రబాబు మీద నమ్మకంతో ఆనాడు రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తుచేశారు. సీఎం జగన్‌కు సీఎం సీటు పర్మినెంట్ కాదని స్పష్టం చేశారు.

Samayam Telugu 23 Aug 2020, 1:59 pm
ఏపీలో ఓవైపు కరోనా వేడి ఉందంటే మరోవైపు రాజకీయ నేతల వ్యాఖ్యలు మరింత వేడి రాజేస్తున్నాయి. అధికార పార్టీ అధినేతపై తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై ఆయన పదునైన విమర్శలు చేశారు. సీఎం జగన్ పచ్చి మోసకారని ఎంపీ కేశినేని మండిపడ్డారు. ముఖ్యమంత్రిగా జగన్ విఫలమయ్యారని విమర్శించారు. 22 మంది ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానని ఇప్పుడు మాట్లాడటం లేదన్నారు. కేసులు నుంచి బయట పడటానికి కేంద్రంతో లాబీయింగ్ చేశారు తప్ప రాష్ట్ర ప్రయోజనాలకు కాదన్నారు కేశినేని.
Samayam Telugu కేశినేని నాని
kesineni nani

Read More: విజయవాడలో ఆ ప్రాంత ప్రజలకు అధికారుల హెచ్చరిక
సీఎం సీటు జగన్‌కి పర్మినెంట్ కాదన్నారు. హిట్లర్ లాంటి వాల్లే కాలగర్భంలో కలిశారని గుర్తుచేశారు. జగన్ మోహన్ రెడ్డి చరిత్ర అంతకంటే హీనమన్నారు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ది చెప్తారని మండిపడ్డారు. చంద్రబాబు మీద నమ్మకంతో ఆనాడు రైతులు రాజధాని కోసం 33 వేల ఎకరాలు ఇచ్చారని గుర్తుచేశారు. గతంలో కూడా కేశినేని నాని సీఎం జగన్‌తో పాటు వైసీపీ నేతలపై పలు సంచలన ఆరోపణలు చేశారు.

మరి తాజాగా కేశినేని చేసిన వ్యాఖ్యలకు అధికార పార్టీ నేతలు ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాల్సిందే. ఎందుకంటే జగన్ సీఎంగా ప్రమాణ స్వీకరం చేపట్టిన నాటి నుంచి అధికార ప్రతిపక్షల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోనే ఉంది. మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా ఆయన ఎప్పటికప్పుడు విమర్శలు చేస్తూనే ఉన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.