యాప్నగరం

విశాఖ షిప్‌యార్డ్ దుర్ఘటన: మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం

విశాఖపట్నం షిప్ యార్డ్ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు రూ. 50 లక్షల పరిహారం అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Samayam Telugu 2 Aug 2020, 4:02 pm
విశాఖపట్నం హిందూస్థాన్‌ షిప్‌యార్డ్‌లో క్రేన్ కుప్పకూలిన దుర్ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబీకులను ఆదుకోవాలంటూ యాజమాన్యంతో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌, గాజువాక వైసీపీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వడానికి యాజమాన్యం ఒప్పుకుంది. అలాగే మృతుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చేందుకు అంగీకరించింది.
Samayam Telugu విశాఖ క్రేన్ ప్రమాదం


కాగా, షిప్‌ యార్డ్‌ మృతులకు రూ.50 లక్షల పరిహార ప్రకటనపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. పెద్ద మొత్తంలో ఎక్స్‌గ్రేషియా ప్రకటించినందుకు గాను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డికి కార్మిక సంఘం నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.

కాగా, భారత రక్షణ రంగ సంస్థ ఆధీనంలో ఉన్న హిందూస్థాన్‌ షిప్‌యార్డ్ నిర్మాణ కేంద్రంలో శనివారం ట్రయల్‌ రన్‌ జరుగుతుండగా భారీ క్రేన్‌ ఒక్కసారిగా కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో 11 మంది మృతి చెందారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.