యాప్నగరం

విశాఖలో కోడలి దాష్టీకం.. సొంత మామ భారమని..

వృద్ధుడిని అనాథని చెప్పి అతని కోడలు రెండు నెలల కిందట నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించి వెళ్లిపోయింది. అయితే ఆయన రోడ్డు పక్కన ఉంటే తీసుకొచ్చానని చెప్పడం గమనార్హం. చివరకు తన కోడలే తనను ఇక్కడ చేర్పించిందని చెప్పడంతో నిరాశ్రయుల వసతి గృహ సిబ్బంది అవాక్కయ్యారు.

Samayam Telugu 1 Nov 2019, 6:19 pm
మానవ సంబంధాలన్నీ మనీ సంబంధాలేనని అన్నాడో మహానుభావుడు.. డబ్బు సంపాదించేంత వరకూ మాత్రమే మానవ సంబంధాలు అంతోఇంతో నిలబడుతున్నాయి. ఇక అతనితో ఏ ఉపయోగం లేదని తలిచారా వెంటనే వదిలించుకునేందుకు దారులు వెతుకడం ప్రారంభమవుతుంది. అచ్చు అలాంటి సంఘటనే విశాఖలో చోటు చేసుకుంది. అనాథ వృద్ధుడని చెప్పి సొంత మామను కోడలు నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించిన ఘటన వెలుగుచూసింది.
Samayam Telugu old-agee


విశాఖకు చెందిన ఓ వివాహిత రెండు నెలల క్రితం ఓ వృద్ధుడిని భీమ్‌నగర్‌ నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించింది. రోడ్డు పక్కన పడుకుని ఉంటే చేసి తీసుకొచ్చానని చెప్పడంతో డిస్పెన్సరీ సిబ్బంది ఆయనను చేర్చుకున్నారు. కొద్దిరోజుల ముందు ఆ వృద్ధుడు తన కోడలే ఇక్కడ చేర్పించిందని అసలు విషయం చెప్పడంతో వసతి గృహ సిబ్బంది అవాక్కయ్యారు. ఆమెని పిలిపించి వృద్ధుడిని అప్పజెప్పారు.

Also Read: అనంతపురంలో కలకలం.. కలెక్టర్ ఎదుట కానిస్టేబుల్ కిరోసిన్ పోసుకుని..

రామదాసు అనే 67 ఏళ్ల వృద్ధుడిని అనాథని చెప్పి అతని కోడలు రెండు నెలల కిందట నిరాశ్రయుల వసతి గృహంలో చేర్పించి వెళ్లిపోయింది. అయితే ఆయన రోడ్డు పక్కన ఉంటే తీసుకొచ్చానని చెప్పడం గమనార్హం. అతడితో ఏమాత్రం సంబంధం లేని వ్యక్తిలా భీమ్‌నగర్‌ వసతి గృహానికి తీసుకొచ్చి అప్పగించి వెళ్లిపోయింది. సిబ్బంది తర్వాత ఆ వృద్ధుడిని ప్రశ్నించడంతో అసలు విషయం వెలుగుచూసింది.

తన కోడలే అనాథని చెప్పి ఇక్కడ చేర్పించిందని రామదాసు చెప్పడంతో వసతి గృహ సిబ్బంది ఆశ్చర్యపోయారు. వెంటనే షెల్టర్ నిర్వాహకురాలు రామదాసు కోడలిని పిలిపించారు. ఆమెకు కౌన్సెలింగ్‌ ఇచ్చి మళ్లీ ఇలాంటి పనులు చేయకూడదని హెచ్చరించారు. వృద్ధుడిని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పి పంపించారు. భర్త ఇంటి విషయాలు పట్టించుకోపోవడం వల్లే ఇలా చేయాల్సి వచ్చిందని కోడలు షెల్టర్ సిబ్బందికి చెప్పినట్లు సమాచారం. అయినప్పటికీ పెద్దవాళ్లను వదిలించుకోవాలనుకోవడం తగదని సర్దిచెప్పి పంపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.