యాప్నగరం

'విశాఖలో కరోనా ముప్పు తీవ్రం.. నగరవాసులు బీ కేర్‌ఫుల్'

విశాఖలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయంటున్న మంత్రి ఆళ్లనాని. ప్రజలు ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని సూచించిన మంత్రి. రెండో దశలోకి ఎంటరవుతున్నామని.. మూడో దశకు రాకుండా ప్రజలు జాగ్రత్తపడాలని సూచన.

Samayam Telugu 24 Mar 2020, 7:13 pm
విశాఖలో కరోనా రెండో దశ వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని. నగరంలో మూడు పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.. రెండో దశలోకి ఎంటరవుతున్నామని.. మూడో దశకు రాకుండా ప్రజలు జాగ్రత్తపడాలి అని సూచించారు. విశాఖలో ప్రత్యేక పరిస్థితులు ఉన్నాయని.. మొదటి దశలో విదేశాల నుంచి వచ్చిన వారికి వైరస్ ఉందని.. రెండో దశలో వారి బంధువులు, స్నేహితులకు వచ్చే అవకాశం ఉందన్నారు. మూడో దశలో విదేశాల నుంచి వచ్చిన వారి బంధువులు, స్నేహితుల నుంచి ప్రజలకు వచ్చే ప్రమాదం ఉందని చెప్పుకొచ్చారు.
Samayam Telugu vsp


Read Also: గ్రామాల్లోకి ఎవరూ రావొద్దంటూ లాక్‌డౌన్.. శభాష్ తెలంగాణ యూత్

విశాఖ ప్రజలు కరోనా ముప్పు మూడో దశకు రాకుండా అప్రమత్తంగా ఉండాలని కోరారు నాని. అందరూ ఇంటికే పరిమితం అయితే బావుంటుందని.. ఇళ్లలో నుంచి ఎవరూ బయటకు రావొద్దని హెచ్చరించారు. లాక్‌డౌన్ విషయంలో పోలీసులు, అధికారులకు సహకరించాలని కోరారు. అలాగే ఐసోలేసన్ బెడ్ల సంఖ్యను పెంచుతున్నామని చెప్పారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. విశాఖలో 20 టీమ్స్‌ను రంగంలోకి దించామన్నారు. అధికారులు పరిస్థితి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని చెప్పారు.

Also Read: చిత్తూరు: ఇంట్లో నుంచి బయటకు వచ్చారో.. మీకూ ఇదే గతి

విదేశాల నుంచి వచ్చిన వారు ప్రభుత్వానికి సహకరించాలని కోరారు మంత్రి.. ఒకవేళ ఎవరైనా నిబంధనలు పాటించకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విదేశాల నుంచి వారిని అబ్జర్వేషన్‌లో ఉన్నారని.. హోం క్వారంటైన్, ఐసోలేషన్ వార్డుల్లో కూడా అధునాతన సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజలో కూడా ప్రభుత్వానికి సహకరించాలన్నారు ఆళ్ల నాని.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.