యాప్నగరం

ఏపీ అలర్ట్: పశ్చిమలో మరో 4 కరోనా పాజిటివ్.. మొత్తం 477 కేసులు

AP coronavirus cases: పశ్చిమ గోదావరి జిల్లాలో మరో నలుగురికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో జిల్లాలో కరోనా కేసుల సంఖ్యల 27కు పెరగగా, రాష్ట్రంలో మొత్తం కేసులు 477కు చేరుకున్నాయి.

Samayam Telugu 14 Apr 2020, 7:59 pm
తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ (కోవిడ్ 19) కేసులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా, పశ్చిమ గోదావరి జిల్లాలో మరో 4 కరోనా కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. జిల్లాలోని ఏలూరులో 3, పెనుగొండలో ఒక కేసు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. తాజాగా నమోదైన కేసులతో ఏలూరులోని తంగెళ్లమూడి ప్రాంతంలో 11కి, పెనుగొండలో 6కి కేసుల సంఖ్య చేరిందని అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఇప్పటివరకు 973 రక్తనమూనాలు సేకరించగా వాటిలో 27 పాజిటివ్‌, 678 నెగటివ్‌ రాగా మరో 268 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు.
Samayam Telugu corona ward


అలాగే మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. మంగళవారం ఏకంగా 34 కేసులు నమోదయ్యాయి. వీటిలో గుంటూరు జిల్లాలో 16, కృష్ణా జిల్లాలో 8, కర్నూలు జిల్లా 7, అనంతపురం జిల్లాలో రెండు.. నెల్లూరు జిల్లాలో ఒక కేసు నమోదుకాగా, సాయంత్రం పశ్చిమ గోదావరి జిల్లాలో 4 కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్రంలో మంగళవారం ఉదయం మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 473కు పెరిగింది. సాయంత్రం నమోదైన నాలుగు కేసులతో కలిపి రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 477కు చేరుకుంది. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు 14మందికి నెగిటివ్ రావడంతో వారిని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.