యాప్నగరం

YSRCP లో గ్రూపు రాజకీయాలు వాస్తవమే.. మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

పశ్చిమ గోదావరి ఉండి వైసీపీలో అంతర్గత కుమ్ములాట ఉన్న మాట వాస్తవమేనని ఆ పార్టీ సీనియర్ వ్యాఖ్యానించారు.

Samayam Telugu 2 Oct 2020, 3:57 pm
పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారా స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. గత కొన్ని రోజులుగా ఉండి వైసీపీలో విభేదాలు నెలకొన్నాయని.. ఒకరంటే మరొకరికి పడట్లేదని పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నేత పాతపాటి సర్రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉండి నియోజకవర్గం వైసీపీలో వర్గపోరు ఉన్న మాట వాస్తవమేనని వెల్లడించారు. నియోజకవర్గంలో వైసీపీ ఓడిపోవడానికి కారణం ఈ గ్రూపు రాజకీయాలేనని ఆయన తేల్చి చెప్పారు. గ్రూపు రాజకీయాలు మానకపోతే నాయకులకు ఏమీ కాదని.. మధ్యలో ఇబ్బంది పడేది కార్యకర్తలేనని వ్యాఖ్యానించారు. వర్గపోరుపై సర్రాజు చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి.
Samayam Telugu వైసీపీ లోగో
YSRCP


కాగా, ఉండి నియోజకవర్గంలో ఇప్పటి వరకు వైసీపీ ఖాతా తెరవలేదు. అక్కడ కాంగ్రెస్, టీడీపీ అభ్యర్థులే గెలుపొందారు. 2009, 2014, 2019లో వరుసగా మూడు సార్లు టీడీపీనే ఇక్కడ విజయం సాధించింది. 2019లో రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభంజనం కనిపించినా ఉండిలో మాత్రం వైసీపీ ఘోరపరాజయం చవిచూసింది.

వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పీవీఎల్ నర్సింహారాజుపై.. టీడీపీ అభ్యర్థి మంతెన రామరాజు భారీ మెజారిటీతో గెలుపొందారు. 10,949 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థిపై మంతెన రామరాజు విజయం సాధించారు. అయితే గత ఎన్నికల్లో వైసీపీలో వర్గపోరు లేకుండా ఉండుంటే కచ్చితంగా నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరేదని వైసీపీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. తాజాగా, మాజీ ఎమ్మెల్యే సర్రాజు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.