యాప్నగరం

చిత్తూరు జిల్లాలో ఏనుగుల బీభత్సం.. భయభ్రాంతులకు గురవుతున్న స్థానికులు

చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. కర్ణాటక నుంచి దారి తప్పి వచ్చిన ఏనుగుల గుంపు పొలాల మీద దాడి చేసి పంటను ధ్వంసం చేస్తున్నాయి.

Samayam Telugu 15 Jan 2020, 6:40 pm
చిత్తూరు జిల్లా యడమరి మండలంలో ఏనుగులు పంట పొలాల మీద దాడులు చేస్తూ.. విధ్వంసం సృష్టిస్తున్నాయి. గత పది రోజులుగా ఏనుగులు పంట పొలాలపై దాడులు చేస్తూ ధ్వంసం చేస్తుండటంతో.. స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు. ఏనుగులు ఎక్కడ దాడి చేస్తాయోనని నిద్రాహారాలు మానుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. పొలాల బావుల దగ్గరకు వెళ్లాలంటేనే రైతులు భయపడుతున్నారు.
Samayam Telugu elephants
నమూనా చిత్రం


వివరాల్లోకి వెళ్తే.. గత పది రోజులుగా దాదాపు పదిహేను ఏనుగుల గుంపు దారి తప్పి కర్ణాటక రాష్ట్రం నుండి కుప్పం, పలమనేరు బంగారుపాళ్యం మీదుగా యడమరి చేరుకున్నాయి. ఇవి పంటలను ధ్వసం చేస్తున్నాయని రైతులు వాపోతున్నారు. ఇటీవల కొలనం పల్లె, కృష్ణాపురం, దాలవాయిపల్లె, నుంజర్ల ప్రాజెక్ట్ వద్ద తిరుగుతూ పంటలను ధ్వసం చేస్తున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు తీసుకుని ఏనుగుల బారి నుంచి తమ పంటపొలాలను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.