యాప్నగరం

Tirupati ఉప ఎన్నిక పోటీపై కమిటీ వేస్తామన్నారు.. గుడుల అపవిత్రంపై నడ్డాకు చెప్పా: పవన్ కళ్యాణ్

Pawan Delhi Tour: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడారు.

Samayam Telugu 25 Nov 2020, 7:51 pm
భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపు మేరకే ఢిల్లీ పర్యటనకు వచ్చినట్లు జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ తెలిపారు. జేపీ నడ్డాతో భేటీ అనంతరం పవన్‌ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. జేపీ నడ్డాతో భేటీలో ప్రధానంగా తిరుపతి బైపోల్స్ గురించి ప్రత్యేకంగా చర్చించినట్లు తెలిపారు. ఉప ఎన్నికలో ఉమ్మడి అభ్యర్థి కోసం చర్చించినట్లు చెప్పుకొచ్చారు. అయితే దీనిపై ఓ కమిటీ వేస్తామని నడ్డా చెప్పారన్నారు. తిరుపతి ఉప ఎన్నికల బరిలో జనసేన అభ్యర్థి ఉంటారా? లేక బీజేపీ అభ్యర్థి ఉంటారా? అన్నది కమిటీలో చర్చించిన తర్వాత స్పష్టత వస్తుందని పవన్‌ చెప్పారు.
Samayam Telugu జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్


అలాగే అమరావతి, పోలవరం అంశాలపై కూడా నడ్డాతో చర్చించినట్లు పవన్ తెలిపారు. దాదాపు గంట సేపు జేపీ నడ్డాతో మాట్లాడినట్లు వివరించారు. భవిష్యత్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై కూడా చర్చించినట్లు చెప్పారు. అమరావతి రైతులకు బీజేపీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారన్నారు.

అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ అవినీతి గురించి, దేవాలయాలపై దాడులు, లా అండ్ ఆర్డర్ గురించి కూడా నడ్డాతో చర్చించినట్లు పవన్‌ కళ్యాణ్ వెల్లడించారు. ఏపీలో గుడుల్లో జరిగిన అపవిత్ర సంఘటనలు, రథాల దగ్ధం, దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసం వంటి అంశాలను జేపీ నడ్డా దృష్టికి తీసుకెళ్లినట్లు పవన్ వివరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.