యాప్నగరం

తిరుమలలో మరో అపచారం.. ఏకంగా మద్యం అమ్మకాలు

తిరుమల కొండపై మరో అపచారం వెలుగులోకి వచ్చింది. నిషేధిత మత్తు పదార్థాలు కొండపై విక్రయిస్తుండడం విస్మయానికి గురిచేస్తోంది. మద్యం విక్రయిస్తున్న మహిళను అరెస్టు చేయడం కలకలం రేపింది.

Samayam Telugu 29 Jan 2020, 3:44 pm
తిరుమలలో అన్యమత ప్రచారం.. ఎస్వీబీసీ చైర్మన్ రాసలీలల ఆడియో టేపుల వివాదాలు మరువక ముందే మరో అపచారం జరిగింది. కలియుగ దైవం వేంకటేశ్వరుడు కొలువైవున్న తిరుమల కొండపై మద్యం అమ్మకాలు కలకలం రేపాయి. తిరుమలలో మద్యం బాటిళ్లు విక్రయిస్తున్న మహిళను ఎక్సైజ్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద ఆరు మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.
Samayam Telugu liquor 1


మద్యం బాటిళ్లు విక్రయిస్తూ మహిళ అరెస్టు కావడం తిరుమలలో సంచలనం కలిగించింది. తిరుమల కొండపై అపచారాలు జరుగుతున్నాయిన మరోమారు స్పష్టమైంది. వాస్తవానికి తిరుమలలో మద్యం, ధూమపానాన్ని నిషేధించారు. తిరుమల ఘాట్ రోడ్డు చెక్‌పోస్టు వద్ద వాహనాలను తనిఖీ చేసి మరీ అనుమతిస్తారు. నిషేధిత వస్తువులు ఉంటే అక్కడే స్వాధీనం చేసుకుంటారు. అయితే అందరి కళ్లుగప్పి మద్యం బాటిళ్లు కొండపైకి ఎలా చేరాయన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

Also Read: విశాఖలో 6 వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్‌కు జగన్ సర్కారు జీవో

ఈ విషయంలో సిబ్బంది ప్రమేయంపైనా అనుమానాలు కలుగుతున్నాయి. సిబ్బంది ప్రోద్బలం లేకుండా మద్యం బాటిళ్లు కొండపైకి తీసుకురావడం అసాధ్యమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో తిరుమలలో అన్యమత ప్రచారం జరుగుతోందని ఆరోపణలు వచ్చాయి. బస్సు టిక్కెట్లపై అన్యమత పర్యటలన వివరాలు ముద్రించడం కూడా పెనుదుమారానికి కారణమైంది. అలాగే కొండపై క్రాస్ గుర్తులు ఉన్నాయంటూ ప్రచారం జరిగింది.

కొద్దిరోజుల కిందట టీటీడీ అనుబంధ విభాగం.. ఎస్వీబీసీ చానల్‌ చైర్మన్ రాసలీలల ఆడియో టేపులు కలకలం రేపాయి. ఈ వ్యవహారం ఎస్వీబీసీ చైర్మన్ రాజీనామాకు దారితీసింది. చానల్ పనిచేస్తున్ మహిళా ఉద్యోగితో చైర్మన్ సరస సంభాషణలతో వివాదం రేగింది. తాజాగా మద్యం బాటిళ్లు పట్టుబడడం చర్చనీయాంశమైంది. తిరుమల తిరుపతిలో చోటుచేసుకుంటున్న వరుస ఘటనలు భక్తులను ఆందోళనలకు గురిచేస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.