యాప్నగరం

అసభ్య ఫోటోలు... వైసీపీ నేతను చెప్పుతో కొట్టిన మహిళ

ప్రకాశం జిల్లాో ఘటన. పోలీస్ స్టేషన్ వద్ద ఘటన. చెప్పుతో వైసీపీ నేతను కొట్టిన మహిళ. ఇరువర్గాల మధ్య ఉద్రిక్తత. పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు.

Samayam Telugu 29 Mar 2020, 2:38 pm
ఏపీలో మహిళల రక్షణ కోసం దిశ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేసిన ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మహిళ పట్ల వేధింపులకు పాల్పడుతూనే ‌ఉన్నారు. తాజాగా సాక్షాత్తు అధికార పార్టీకి చెందిన ఓ నేత ఇదే విషయమై ఓ మహిళ చేత తన్నలు తిన్నాడు. తన ఫోటోల్ని వాట్సాప్‌లో అసభ్యకరంగా పెడుతున్నాడని ఓ మహిళ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోన ఆగ్రహం కట్టెలు తెంచుకొని వైసీపీ నేతను చెప్పుతో కొట్టింది. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.
Samayam Telugu ysr_flag


ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం పోలీస్ స్టేషన్ దగ్గర ఉద్రిక్తత చోటుచేసుకుంది. తన ఫొటోలను అసభ్యకరంగా వాట్సప్‌లో పెట్టాడని ఓ మహిళ తీవ్ర ఆగ్రహం చేసింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన ఆ మహిళ వైసీపీ నేతను చెప్పుతో కొట్టింది. దీంతో యర్రగొండపాలెం పీఎస్‌ దగ్గర ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. అయితే అసలు గొడవేంటి? ఆ వైసీపీ నేత ఎవరు..? అనే విషయాలు ఇంకా తెలియాల్సి ఉంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.