యాప్నగరం

విశాఖ: లారీ టైర్ విడిపోయి.. రోడ్డు పక్కన మహిళకు తగలడంతో..

విశాఖ శివారులోని నక్కపల్లి సమీపంలో రోడ్డు దాటుతుండగా ప్రమాదం.. లారీ టైర్ మహిళను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలు. స్థానికులు ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మృతి.

Samayam Telugu 17 Dec 2019, 12:53 pm
విశాఖ జిల్లాలో ఓ రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. పాపం రోడ్డు పక్కన కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుని రోడ్డు దాటుతున్న మహిళను లారీ టైర్ రూపంలో మృత్యువు వెంటాడింది. మంగళవారం ఉదయం నక్కపల్లికి చెందిన గింజాల సన్యాసమ్మ కుళాయి దగ్గర నీళ్లు పట్టుకుంది.. ఆమె మెల్లిగా రోడ్డు దాటుతున్న సమయంలో తుని నుంచి విశాఖ వైపు వెళుతున్న ఓ లారీ అటువైపుగా వచ్చింది.
Samayam Telugu vsp.


ఆమె రోట్టు దాటుతున్న సమయంలోనే.. ఆ టైర్ లారీ నుంచి విడిపోయింది. ఆ టైర్ వేగంగా వచ్చి మహిళను ఢీకొట్టడంతో ఆమె అక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే గమనించిన స్థానికులు హుటా హుటిన సమీపంలో ఉన్న ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు వైద్యం అందించగా.. చికి్త్సపొందుతూ చనిపోయింది.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. లారీ టైర్ విడిపోవడానికి కారణాలపై ఆరా తీస్తున్నారు. కుళాయి దగ్గర నీళ్ల కోసం వెళ్లి ఇలా సన్యాసమ్మ ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది. అప్పటి వరకు కళ్ల ముందు కనిపించిన ఆమె చనిపోవడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.