యాప్నగరం

గుంటూరు: మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం.. నేరుగా సీఎం జగన్‌కు లేఖ

వాలంటీర్ పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆమె దగ్గర ఓ లేఖను గుర్తించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు లేఖ రాసింది.

Samayam Telugu 25 Nov 2020, 7:27 am
గుంటూరు జిల్లాలో మహిళా వాలంటీర్ ఆత్మహత్యాయత్నం కలకలంరేపింది. సత్తెనపల్లి ఐదో వార్డు సచివాలయం వాలంటీరు మహంకాళి అంకేశ్వరి ఎలుకల మందు తిని ఆత్మహత్యకు యత్నించారు. కుటుంబ సభ్యులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా.. పరిస్థితి విషమంగా ఉండటంతో గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. ఆమె దగ్గర ఓ లేఖను గుర్తించారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబులకు లేఖ రాసింది.
Samayam Telugu వాలంటీర్ ఆత్మహత్యాయత్నం


తాను ఆరో వార్డు రేషన్‌ డీలర్‌ వేధింపులు తాళలేక చనిపోతున్నట్లు అంకేశ్వరి లేఖలో రాశారు. నిజాయతీగా పని చేస్తున్నప్పటికీ అనర్హురాలికి చేయూత పథకం లబ్ధి అందలేదనే కారణాన్ని చూపించి ఉద్యోగం నుంచి తనను తొలగించే ప్రయత్నం చేస్తున్నారని.. తన ఆత్మహత్యకు రేషన్‌ డీలర్‌ కారణమని.. మిగిలిన వాలంటీర్లూ క్షమించండి.. అమ్మా క్షమించు అని ఆమె లేఖలో రాశారు.

ఇదిలా ఉంటే అర్హత ఉన్నా ప్రభుత్వ పథకాల లబ్ధి అందజేయట్లేదని.. సకాలంలో తమకు పథకాలు అందేలా చూడట్లేదని.. ఆరో వార్డుకు చెందిన ప్రజలు వాలంటీర్‌ అంకేశ్వరిపై స్పందనలో లిఖితపూర్వక ఫిర్యాదు చేశారట. అధికారులు విచారణ చేపట్టి విధుల నిర్వహణలో అంకేశ్వరి నిర్లక్ష్యం చూపిస్తున్నట్లు తేల్చి ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని సిఫార్సు చేస్తూ కమిషనరుకు లేఖ పంపారు. ఆమెను విధుల నుంచి తొలగించలేదని.. పనితీరుపై విచారణ నివేదిక వచ్చిందని కమిషనర్ అంటున్నారు. తనను విధుల నుంచి తొలగిస్తారని భావించి మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసుకున్నట్లు భావిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.