యాప్నగరం

జగన్‌కు సాధ్యం కానిది సాధించిన వైసీపీ ఎంపీ.. బీజేపీ వాళ్లకు ఆ ఛాన్స్ దక్కలేదు

దేశంలో వై కేటగిరిని చాలా కీలకమైన వ్యక్తులకు మాత్రమే ఇస్తారట. బడా నేతలు, ప్రముఖులు వై కేటగిరీ కోసం ప్రయత్నించినా దొరకదట. ప్రస్తుతం బీజేపీలో ఉన్న చాలా మంది ప్రయత్నం చేసినా ఫలితం లేదట.

Samayam Telugu 7 Aug 2020, 8:47 am
రఘురామకృష్ణరాజు వైఎస్సార్‌సీపీకి రెబల్ ఎంపీలా మారిపోయారు. అధినేత జగన్‌పై అభిమానం ఉందంటూనే ఎప్పటికప్పుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఏపీ సీఎంకు వరుసగా లేఖాస్త్రాలు సంధిస్తూనే ఉన్నారు. అంతేకాదు పట్టుబట్టి మరీ కేంద్ర బలగాలతో సెక్యూరిటీని సాధించుకున్నారు. 11 మంది సిబ్బందితో కూడిన వై కేటగిరి భద్రత ఆయనకు వచ్చింది. వై కేటగిరీ భద్రత కూడా ఆషామాషీ వ్యవహారం కాదని.. దీని వెనుక పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.
Samayam Telugu సీఎం జగన్


Read Also: విశాఖ కాదు విజయవాడలోనే.. జగన్ సర్కార్ క్లారిటీ

దేశంలో వై కేటగిరిని చాలా కీలకమైన వ్యక్తులకు మాత్రమే ఇస్తారట. బడా నేతలు, ప్రముఖులు వై కేటగిరీ కోసం ప్రయత్నించినా దొరకదట. ప్రస్తుతం బీజేపీలో ఉన్న చాలా మంది ప్రయత్నం చేసినా ఫలితం లేదట. అంతేకాదు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ ఈ భద్రత కోసం ట్రై చేశారట. ఆయనకూ నిరాశ తప్పలేదట. ఇప్పుడు రఘురామకృష్ణరాజుకు ఎలా దొరికిందనే చర్చ జరుగుతోంది. రాజు గారు మామూలు వ్యక్తి కాదు అంటూ చర్చ జరుగుతోంది. వై కేటగిరీ భద్రత రావడం ఆసక్తికరంగా మారింది.

Also Read: ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే.. జగన్ సర్కార్ సంకేతాలు!

ఏపీ మంత్రి, వైఎస్సార్‌సీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కొందరు రఘురామపై పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. కొందరు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఎంపీ దిష్టి బొమ్మల్ని దగ్థం చేశారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేల నుంచి తనకు ముప్పు ఉందంటూ ఎంపీ కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన తన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వెళ్లలేకపోతున్నానని.. తనకు భద్రత కల్పించాలని కోరారు. కేంద్రమంత్రుల్ని కలిసి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కేంద్రం వై కేటగిరి భద్రతను కల్పించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.