యాప్నగరం

రోడ్డెక్కితే యముడి చేతికి చిక్కినట్టే.. కర్నూలు పోలీసుల వినూత్న ప్రచారం

లాక్‌డౌన్ వేళ ప్రజలు అనవసరంగా రోడ్డెక్కకుండా చూడటం కోసం కర్నూలు జిల్లా పోలీసులు వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. కళాకారులతో యముడు, చిత్రగుప్తుడు, కరోనావైరస్ వేషాలు వేయించి ప్రచారం చేయిస్తున్నారు.

Samayam Telugu 1 Apr 2020, 4:49 pm
లాక్‌డౌన్ వేళ ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ప్రభుత్వాలు పదే పదే సూచిస్తున్నాయి. అత్యవసరమైతే తప్పితే.. రోడ్డు ఎక్కొద్దని కోరుతున్నాయి. కొన్ని చోట్ల పోలీసులు రోడ్డు ఎక్కిన వారిపై లాఠీ ఝులిపిస్తున్నారు, గుంజిళ్లు తీయించడం, మోకాళ్లపై నడిచిపించడం లాంటి శిక్షలు విధిస్తున్నారు. ఈ విషయమై పై అధికారుల దృష్టికి వెళ్లడంతో కొందరు పోలీసులు సస్పెండయ్యారు. దీంతో రోడ్డు ఎక్కొద్దు బాబూ అని పోలీసులు ప్రజలకు బతిమాలి చెబుతున్నారు. కర్నూలు జిల్లా డోన్ పోలీసులు మాత్రం వినూత్నంగా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.
Samayam Telugu done police


స్థానిక కళాకారులతో యమధర్మరాజు, చిత్రగుప్తుడు, కరోనా వైరస్ వేషాలను వేయించిన పోలీసులు. వారిని తమ వెంట పట్టణమంతా తిప్పుకొంటున్నారు. ప్రజలెవరూ ఇళ్ల నుంచి బయటకు రావొద్దని.. వస్తే కరోనా సోకి యమధర్మరాజు మిమ్మల్ని పట్టుకెళ్తాడని హెచ్చరిస్తున్నారు.

ఈ విషయమై డోన్ రూరల్ సీఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని సందేశం ఇవ్వడం కోసం.. కళాకారులతో యమధర్మరాజు, చిత్రగుప్తుడు, కరోనా వేషధారణ వేయించి వినూత్నంగా ప్రచారం చేయిస్తున్నామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.