యాప్నగరం

కరోనా సాయం కింద రూ.2కోట్లు ప్రకటించిన సీఎం జగన్ తమ్ముడు

ఎంపీ నిధుల నుంచి రూ.2కోట్లు ప్రకటించిన సీఎం జగన్ సోదరుడు అవినాష్‌రెడ్డి. ఈ నిధుల ద్వారా క్వారంటైన్లు, ఆసుపత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో అన్ని రకాలా వసతులు ఏర్పాటు చేయాలని సూచన.

Samayam Telugu 26 Mar 2020, 2:21 pm
కరోనా కట్టడికి ఏపీ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు ముమ్మరం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా జిల్లాలవారీగా స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించింది. గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటింటి సర్వే చేస్తున్నారు. ఇలాంటి విపత్కర సమయంలో రాజకీయ ప్రముఖులు, సినిమా సెలబ్రిటీలు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వాలకు, ప్రజలకు తోడుగా ఉన్నామంటున్నారు.. తమకు తోచిన సాయాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే పలువురు ఎంపీలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాన్ని ప్రకటించారు.
Samayam Telugu cm


కడప ఎంపీ, ఏపీ సీఎం జగన్ సోదరుడు అవినాష్‌రెడ్డి మంచి మనసును చాటుకున్నారు. కరోనా వ్యాప్తి నివారణకు చేపట్టే చర్యలకు తన ఎంపీ నిధులనుంచి రూ.2కోట్లు నిధులు కేటాయిస్తున్నట్లు కలెక్టర్‌కు తెలిపారు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా జిల్లాలో అన్ని రకాల చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ నిధుల ద్వారా క్వారంటైన్లు, ఆసుపత్రుల్లోని ఐసోలేషన్‌ వార్డుల్లో అన్ని రకాలా వసతులు ఏర్పాటు చేయాలన్నారు. పులివెందులలో క్వారంటైన్‌ సెంటర్‌ ఏర్పాటు గురించి అడిగి తెలుసుకున్నారు.

Must Read: కరోనా కష్టాలు అప్పటివరకూ తప్పవా.. పంచాంగంలో ఏముందంటే..

ఈ సెంటర్‌లో అన్ని రకాల అధునాతన పరికరాలతో వసతులు ఏర్పాటు చేయాలని ఎంపీ సూచించారు. పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డులో మెరుగైన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలన్నారు. నిత్యావసర వస్తువులు అధిక ధరలకు విక్రయించకుండా ప్రజలకు లభ్యమయ్యేలా చూడాలన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.