యాప్నగరం

జగన్ ఫ్యాన్సా, మజాకా: గిన్నిస్ రికార్డు బద్దలు.. టచ్ చేయలేని ఫీట్!

YS Jagan Mohan Reddy: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజును పురస్కరించుకుని వైసీపీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు.

Samayam Telugu 21 Dec 2020, 7:35 pm
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా చేపట్టారు. భారీ ఎత్తున సంబరాలు, కేక్ కటింగ్స్‌తో రాష్ట్రవ్యాప్తంగా ఉల్లాసభరిత వాతావరణం నెలకొంది. అయితే అభిమానులు, వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సీఎం జగన్ బర్త్ డేను పురస్కరించుకుని కొన్ని మంచి కార్యక్రమాలకు పూనుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఈ రక్తదాన కార్యక్రమం అత్యంత అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.
Samayam Telugu సచివాలయంలో పుట్టిన రోజు వేడుకల్లో సీఎం జగన్


175 నియోజకవర్గాల్లో పార్టీ శ్రేణులు చేపట్టిన రాక్తదాన కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను బద్దలు కొట్టింది. సీఎం జగన్ అభిమానులు, వైసీపీ శ్రేణులు 18 వేల యూనిట్ల రక్తం దానం చేశారు. గతంలో రక్తదానానికి సంబంధించి 10,500 యూనిట్లుగా ఉన్న గిన్నిస్ రికార్డ్‌ను వైసీపీ ఫ్యాన్స్ తుడిచిపెట్టారు. ప్రస్తుత ఈ రికార్డ్‌ను వండర్ బుక్ ఆఫ్‌ రికార్డ్స్ ఇంటర్నేషనల్ నమోదు చేసుకుంది.
ఇక, ఏపీ సీఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి పుట్టిన రోజు కావడంతో ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రధాని నరేంద్ర మోదీ, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు, మెగాస్టార్ చిరంజీవి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురు సీఎం జగన్‌కు బర్త్ డే విషెస్ చెప్పారు. వైసీపీ శ్రేణులైతే జగన్ పుట్టిన రోజును పండుగలా జరుపుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.