యాప్నగరం

YS Jagan అదిరిపోయే ప్లాన్.. వర్కౌటైతే తిరుగుండదు!

ఇప్పటి వరకు పాలనాపరమైన అంశాలపై ఫోకస్ పెట్టిన జగన్.. ఇక పార్టీ కోసం సరికొత్త వ్యూహాలు సిద్ధం చేసే పనిలో ఉన్నారా?.. అందుకే పార్టీలోకి చేరికల్ని ముమ్మరం చేశారా?

Samayam Telugu 8 Oct 2019, 8:37 pm
సార్వత్రిక ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది. నవరత్నాలతో పాటూ మిగిలిన పథకాలను అమలు చేస్తూ.. పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు జగన్. గత నాలుగు నెలలుగా పాలనపై ప్రధానంగా ఫోకస్ పెట్టిన ఆయన.. ఇప్పుడు పార్టీని బలోపేతం చేసేందుకు కసరత్తు మొదలు పెట్టారు. జిల్లాలవారీగా వ్యూహాలను సిద్ధం చేసుకుని.. పార్టీ కాస్త బలహీనంగా ఉన్నచోట బలమైన నేతల్ని పార్టీలకి లాగే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇప్పటికే కసరత్తును మొదలుపెట్టారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు.. అటు పార్టీని బలోపేతం చేయడంతో పాటూ ప్రతిపక్షాలను దెబ్బకొడుతున్నారనే చర్చ మొదలయ్యింది.
Samayam Telugu సీఎం జగన్


Read Also: 'నేను పోయాక టీడీపీ జెండా కప్పుకొని పోతా.. ఆ పిరికి పందలు మాకొద్దు'

ఈ క్రమంలోనే పార్టీలోకి చేరికల్ని మొదలు పెట్టింది వైఎస్సార్‌సీపీ. ఈ క్రమంలోనే తోట త్రిమూర్తులు, రామనాథం బాబు, ఆకుల సత్యనారాయణ, జూపూడి ప్రభాకర్‌ ఇలా వరుసగా నేతలు పార్టీలోకి క్యూ కడుతున్నారు. ఈ చేరికల వెనుక జగన్ రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. జిల్లాలవారీగా పార్టీ నేతలతో సమీక్షలు చేస్తున్న జగన్.. అవసరమైన చోట్ల నాయకత్వ మార్పుకు మొగ్గు చూపుతున్నారట. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాలోపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారట.

Also Read: 'జగన్‌ను సైకో, కాలకేయుడన్న వ్యక్తిని వైసీపీలో చేర్చుకున్నారు'

ముందుగా ఆకుల సత్యనారాయణ విషయానికి వస్తే.. తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి కీలకమైన నియోజకవర్గం. ఇక్కడ రూరల్, అర్బన్ నియోజకవర్గాల్లో 2014, 2019లో వైఎస్సార్‌సీపీకి ఓటమి తప్పలేదు. దీంతో అక్కడి నుంచి పోటీచేసిన ఆకుల వీర్రాజును తప్పించి.. కొత్తగా పార్టీలో చేరిన ఆకులకు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారట. అందుకే పార్టీలోకి తీసుకున్నట్లుగా చర్చ జరుగుతోంది.

అదే జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో తోట వాణికి బదులు దవులూరి దొరబాబుకు ఇంఛార్జ్ పదవి అప్పగించే అవకాశం ఉందట. పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో మాజీ ఎమ్మెల్యే బాబ్జి బదులు కౌరు శ్రీనివాస్‌కు పార్టీ బాధ్యతలు ఇస్తారని టాక్ నడుస్తోంది. ఉండిలోనూ నాయకత్వ మార్పు ఖాయమని.. సీవీల్ నరసింహరాజును మార్చే ఛాన్స్ ఉందట. రాజమండ్రి సిటీలో ఎరౌతు సూర్యప్రకాశరావు బదులు శికాకుళపు శివ రామ సుబ్రహ్మణ్యం పేరు వినిపిస్తోందట.

కృష్ణాజిల్లా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బొప్పన భవకుమార్ బదులు మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవివైపు మొగ్గు చూపే అవకాశం ఉందట. ఇటు ప్రకాశం జిల్లా పర్చూరులో దగ్గుబాటిని తప్పించే అవకాశం ఉందని.. అందుకే మాజీ ఇంఛార్జ్ రామనాథం బాబును మళ్లీ వైఎస్సార్‌సీపీలో చేర్చుకున్నారని టాక్. ఈ మార్పులన్నీ త్వరలోనే జరగబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే అధికారికంగా మార్పులు జరిగితే తప్ప.. ఈ అంశంపై క్లారిటీ రాదు. సో వెయిట్ అండ్ సీ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.