యాప్నగరం

బీజేపీ నాయకురాలికి పదవిచ్చిన జగన్..

బీజేపీ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు సోదరుడి కుమార్తె సంచిత గజపతిరాజుకు జగన్ సర్కారు నామినేటెడ్ పదవి ఇచ్చింది.

Samayam Telugu 21 Feb 2020, 3:29 pm
బీజేపీ మహిళా నేత, టీడీపీ సీనియర్ నాయకుడు అశోక్ గజపతి రాజు సోదరుడి కుమార్తె సంచిత గజపతిరాజుకు జగన్ సర్కారు నామినేట్ పదవి ఇచ్చింది. సింహాచలం ఆలయ పాలకమండలి సభ్యురాలిగా ఆమెను నియమించింది. విజయనగరం రాజకుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతో ఆమెను పాలక మండలి సభ్యురాలిగా నియమించారని భావిస్తున్నారు. ఆనంద గజపతిరాజు, ఉమ దంపతుల కుమార్తె అయిన సంచిత గజపతి రాజు 2018 అక్టోబర్‌లో బీజేపీలో చేరారు.
Samayam Telugu jagan ys


జగన్ సర్కారు మూడు రాజధానుల ప్రకటన పట్ల సంచిత సానుకూలంగా స్పందించారు. సోషల్ అవేర్‌నెస్ న్యూయర్ ఆల్టర్నెటివ్స్ పేరిట జీవోను నడుపుతున్న సంచిత.. గజపతి రాజు కుటుంబం నుంచి బీజేపీలో తొలి వ్యక్తి కావడం గమనార్హం. ప్రస్తుతం ఆమె బీజేవైఎం జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు.

రాష్ట్రంలోని మూడు ప్రధాన ఆలయాలు విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ ఆలయం, సింహాచలం వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయం, ద్వారకా తిరుమలలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయాలకు ప్రభుత్వం ఇటీవలే ట్రస్టు బోర్డులను ఏర్పాటు చేసింది. ఇందులో సంచిత సహా 16 మందికి అవకాశం కల్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.