యాప్నగరం

లక్ష్మీ పార్వతికి కీలక బాధ్యతలు అప్పగించిన జగన్ సర్కారు

YSRCP తరఫున బలంగా వాయిస్ వినిపించే నేతల్లో ఒకరైన లక్ష్మీపార్వతికి జగన్ గిఫ్ట్ ఇచ్చారు. ఆమెను తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఏపీ సర్కారు జీవో జారీ చేసింది.

Samayam Telugu 6 Nov 2019, 6:23 pm
వైఎస్ఆర్సీపీ తరఫున బలంగా వాయిస్ వినిపించే లక్ష్మీ పార్వతికి జగన్ సర్కారు నామినేటెడ్ పదవిని కట్టబెట్టింది. దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ భార్య అయిన లక్ష్మీ పార్వతిని తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌‌గా నియమిస్తూ జీవో జారీ చేసింది. లక్ష్మీ పార్వతికి నామినేటెడ్ పదవి ఖాయమని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ఆమెకు తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు అప్పగించారు.
Samayam Telugu jagan lp


చంద్రబాబును విపరీతంగా వ్యతిరేకించే లక్ష్మీ పార్వతి.. వైఎస్ఆర్సీపీకి ఆయుధంలా మారారు. కుదిరినప్పుడల్లా టీడీపీపై ఆమె తీవ్ర విమర్శలు గుప్పించేవారు. ఎన్నికల వేళ చంద్రబాబు, లోకేశ్‌లను టార్గెట్‌గా చేసుకొని ఆమె విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆమె వ్యక్తిత్వాన్ని దిగజార్చేలా ప్రచారం కూడా జరిగింది.

Read Also: జగన్ జీతం రూపాయి.. కిటికీలకు రూ.73 లక్షలు..

ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్న లక్ష్మీ పార్వతి.. జగన్ తరఫున బలంగా తన గొంతుకను వినిపించారు. వాస్తవానికి ఆమె ఎమ్మెల్సీ పదవిని ఆశించారని ప్రచారం జరిగింది. ఆర్టీసీ చైర్‌పర్సన్‌గా నియమిస్తారని కూడా వార్తలొచ్చాయి. కానీ జగన్ సర్కారు మాత్రం ఆమెను తెలుగు అకాడమీ చైర్‌పర్సన్‌గా నియమించింది.

Read Also: సీఎస్ బాధ్యతల నుంచి వైదొలిగాక.. ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక నిర్ణయం

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.